Begin typing your search above and press return to search.

కోవిడ్​ పరీక్షల్లో ఏపీ టాప్​.. పక్కా వ్యూహంతో ముందుకెళ్లిన జగన్​

By:  Tupaki Desk   |   30 Nov 2020 10:30 AM GMT
కోవిడ్​ పరీక్షల్లో ఏపీ టాప్​.. పక్కా వ్యూహంతో ముందుకెళ్లిన జగన్​
X
కరోనాను అరికట్టేందుకు ఏపీ జగన్​ పక్కావ్యూహంతో ముందుకెళ్తున్నారు. ట్రేసింగ్​ - టెస్టింగ్​ - ట్రీట్‌మెంట్‌ అనే ట్రిపుల్​ టీ విధానాన్ని ఆయన పక్కాగా ఫాలోఅవుతున్నారు. టెస్టులు చేయడంలో మిగతా రాష్ట్రాలకంటే చాలా ముందున్నది జగన్​ ప్రభుత్వం. తొలినుంచి కరోనాను అరికట్టడంలో ఏపీ ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నది. అందుకే రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది. అయితే కరోనాను నివారించడంలో ఏపీ సీఎం జగన్ ​మోహన్​ రెడ్డి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. కరోనా టెస్టులు చేయడంలో ఏపీ ప్రభుత్వం రికార్డును నమోదు చేసింది.

ఆదివారం నాటికి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో కోటిమందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్​ కరోనాను ఎలా తట్టుకుంటుందోనని అందరూ ఎగతాళి చేశారు. ఎందుకంటే కరోనా మొదలయ్యేనాటికి ఏపీలో సరైన పరీక్షా కేంద్రాలు లేవు. ఆపత్కాలంలో అండగా నిలవాల్సిన విపక్షాలు, ఓ వర్గం మీడియా ఏపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. ‘కరోనా తో ప్రజలు కలిసి జీవించాల్సిందే’ అని సీఎం అన్న మాటలను ఎగతాళి చేశాయి. కానీ అవేమి పట్టించుకోని జగన్​ డబ్ల్యూహెచ్​వో - కేంద్రప్రభుత్వ విధానాలను పక్కాగా ఫాలో అయ్యారు. టెస్టింగ్ - ట్రేసింగ్ - ట్రీట్‌ మెంట్‌ విధానాన్నే ఆయన నమ్ముకున్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కోవిడ్​ సోకిన రోగులకు ఉచితవైద్యం అందించాడు. క్వారంటైన్​ ఉన్నవాళ్లు మంచి భోజనం పెట్టాడు. విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజారోగ్యం కోసం జగన్​ప్రభుత్వం శక్తివంచన లేకుండా పనిచేసింది. కరోనా పరీక్షలు చేసేందుకు రాష్ట్రంలో ల్యాబ్​ లే అందుబాటులో లేని పరిస్థితి నుంచి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 150 ల్యాబ్​లు ఉన్నాయి.

శాంపిళ్ల సేకరణకు ప్రభుత్వం పక్కా వ్యూహం రచించింది. వైద్య - ఆరోగ్యశాఖ అధికారులు ఎంతో సమర్థంగా పనిచేశారు. 104 అనే కాల్ సెంటర్​ ను ఏర్పాటు చేసి ఎవరు ఫోన్​చేసినా వైద్య సిబ్బంది నిమిషాల్లో అక్కడికి చేరుకొని శాంపిళ్లు సేకరిస్తున్నారు. దేశంలో 13,95,03,803 టెస్టులు జరగ్గా, అందులో ఏపీలో 1,00,17,126 టెస్టులు జరిగాయి. దేశం మొత్తం మీద జరిగిన టెస్టుల్లో ఇది 7.18 శాతం. దేశంలో మొత్తం కోటి టెస్టులు చేసిన రాష్ట్రాలు ఐదు మాత్రమే ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. కరోనా టెస్టులు చేసేందుకు ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం వలంటీర్ల సేవలు వినియోగించుకున్నది. తెలంగాణలో టెస్టులు సరిగ్గా చేయడం లేదని విపక్షాలు ఆరోపించాయి. ఏపీని చూసి నేర్చుకొండి అంటూ తెలంగాణ ప్రతిపక్ష నేతలు విమర్శించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ హైకోర్టు కూడా ఏపీలో జరుగుతున్న టెస్టులను ప్రస్తావించింది. తెలంగాణ ప్రజలంతా కరోనా టెస్టుల సమయంలో ఏపీతో పోల్చుచూసుకొనే పరిస్థితి వచ్చింది.