Begin typing your search above and press return to search.

స్కూళ్లు తెరచి , ఎన్నికలు వద్దు అనడం వెనుక వైసీపీ వ్యూహం ఇదే !

By:  Tupaki Desk   |   2 Nov 2020 11:30 PM GMT
స్కూళ్లు తెరచి , ఎన్నికలు వద్దు అనడం వెనుక వైసీపీ వ్యూహం ఇదే !
X
ఏపీలో కరోనా జోరు కొనసాగుతూనే.. అయితే, గతంలో రోజుకి పదివేలకి పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఆ సంఖ్య రోజురోజులు గడిచే కొద్ది తగ్గుతూ వస్తుంది. అయితే దేశంలోని కొన్ని రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీలో కరోనా కేసులు ఎక్కువగానే నమోదు అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 8,25,966కు చేరుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల మృతి చెందిన వారి సంఖ్య 6,706కు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 8,25,966 పాజిటివ్ కేసులకు గాను.. 7,95,592 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 23,668 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికి కూడా ఇంకా కరోనా కేసులు వేలల్లోనే నమోదు అవుతున్నాయి.

ఇక ఇదిలా ఉంటే .. ఏపీలో మళ్లీ స్కూళ్లు మొదలైయ్యాయి. గత 7 నెలలుగా మూతపడ్డ స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. అయితే పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించనున్నారు. మొదటగా తొమ్మిది, పదితో పాటు ఇంటర్‌ విద్యార్థులకు తరగతులు ప్రారంభించారు. రోజు విడిచి రోజు ఒక్క పూట నిర్వహిచనున్నారు. నవంబర్‌ 23 నుంచి ఆరు, ఏడు, ఎనిమిదో తరగతులకు బోధన ప్రారంభం అవుతుంది. అలాగే రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకుల పాఠశాలలు కూడా ప్రారంభమయ్యాయి. ఇక.. డిసెంబర్‌ 14 నుంచి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతులకు క్లాసులు నిర్వహిస్తారు. నవంబర్‌ 16 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ తరగతులు మొదలు కానున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు కూడా ఇదే షెడ్యూల్‌ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టంచేసింది.

ఇది కాసేపు పక్కన పెడితే .. కరోనా కంటే ముందు లోకల్ ఎలక్షన్స్ కి ఈసీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆ ప్రాసెస్ మొదలుపెట్టినా , కరోనా విజృంభణతో ఆ సీన్ మారిపోయింది. అయితే అప్పుడు ప్రభుత్వం తో మాట్లాడకుండానే ఈసీ ఏకంగా రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దానిపై ఏపీలో పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా దేశంలో ఈసీ ఎలక్షన్స్ నిర్వహిస్తున్న సమయంలో రాష్ట్రంలో లోకల్ ఎన్నికలు పెట్టాలని రాష్ట్ర ఈసీ ప్రయత్నాలు మొదలుపెట్టినా కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కరోనా ఉందని , ఎన్నికలు మరిన్ని రోజులు వాయిదా వేయాలని అంటుంది. దీనితో విపక్షాలు .. స్కూళ్లు తెరచే విషయంలో అడ్డురాని కరోనా .. ఎన్నికలకి మాత్రమే వస్తుందా అని విమర్శలు చేస్తున్నారు. అయితే దీనిపై వైసీపీ నేతలు కూడా స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. స్కూళ్లు తెరచింది కేవలం విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యానే ..అలాగే కోరానా నియమాలు పాటించేలా , అలాగే ఒక్కో తరగతికి ఒక్కోరోజు ఉండేలా చూస్తున్నామని , పిల్లల భవిష్యత్ కి రాజకీయాలకి లింక్ పెట్టడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అంత అర్జెంట్ గా ఎన్నికలు పెట్టకపోతే ప్రపంచం ఏమి నాశనం కాదు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.