Begin typing your search above and press return to search.
సర్వే షాక్.. ఏపీలో కోటి మందికి కరోనా వచ్చి పోయిందట!
By: Tupaki Desk | 11 Sept 2020 10:15 AM ISTఇటీవల జరిపిన ఒక సర్వే ఫలితం ఒకటి షాకింగ్ గా మారింది. విన్నంతనే ఉలిక్కిపడేలా ఉన్న ఈ సర్వే ఫలితాన్ని చూస్తే.. ఒక పట్టాన జీర్ణించుకోలేని పరిస్థితి. ఏపీలోని ఐదు కోట్ల మందిలో అధికారికంగా నమోదైన కరోనా కేసులు ఐదు లక్షలు మాత్రమే. అయితే.. ఇప్పటికి కోటి మంది వరకు కరోనా వచ్చి పోయిందని.. తాము వైరస్ ప్రభావానికి లోనై ఉన్నామన్న విషయం కూడా ఆ కోటి మందికి తెలీదంటూ తాజాగా ఒక సర్వే ఫలితం విడుదలైంది.
ఇంతకీ ఈ సర్వేను ఎవరు చేశారు? ఎందుకు చేశారు? తాజాగా విడుదలైన సర్వే ఫలితాలు ఏం చెబుతున్నాయి? అన్న వివరాల్లోకి వెళితే.. ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సీరో సర్వేను నిర్వహించింది. దీనికి సంబంధించిన వివరాల్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ విడుదల చేశారు. ఆ వివరాల ప్రకారం ఏపీలోని మొత్తం జనాభాలో 19.7 శాతానికి (దాదాపు కోటి మందికిపైనే) కరోనా వైరస్ సోకి వెళ్లిపోయినట్లు గుర్తించారు.
తొలిదశలో అనంతపురం.. తూర్పుగోదావరి.. క్రిష్ణా.. నెల్లూరు జిల్లాల్లో సర్వే నిర్వహించారు. 15.7 శాతం మందికి వైరస్ సోకి.. వెళ్లినట్లుగా తేలింది. రెండో దశలో మిగిలిన తొమ్మిది జిల్లాల్లోనూ సర్వే నిర్వహించారు. ఏపీలోని ఒక్కోజిల్లా నుంచి 5 వేల మంది చొప్పున మొత్తం 45 వేల శాంపిల్స్ సేకరించారు. వారిలో 19.7 శాతం మందికి వైరస్ సోకిన వైనం కూడా తెలీకుండానే వచ్చి.. తగ్గిపోయినట్లుగా తేలింది. వైరస్ తాలుకూ లక్షణాలు వారిలో కనిపించలేదు. కానీ.. కరోనా సంబంధిత యాంటీబాడీస్ ను వారిలో గుర్తించారు.
ఇలాంటి లక్షణాలు అత్యధికంగా ఉన్న జిల్లాల్లో విజయనగరం (30.6 శాతం) తొలి స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో కర్నూలు (28.1శాతం) నిలిచింది. శ్రీకాకుళం (21.5).. చిత్తూరు (20.8).. విశాఖ (20.7).. కడప (19.3).. గుంటూరు (18.2).. ప్రకాశం (17.6)లో మందిలో యాంటీబాడీలు కనిపించాయి. పశ్చిమగోదావరి జిల్లా చివరి స్థానంలో నిలిచింది. వైరస్ సోకినట్లు తెలీకుండానే దాన్ని జయించిన వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండటం విశేషం. యాంటీబాడీస్ నున గుర్తించిన వారిలో మహిళలు 19.9 శాతం ఉంటే.. పురుషులు 19.5 శాతం మంది ఉన్నారు.
సర్వే ఫలితాల నేపథ్యంలో రానున్న రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అదే విధంగా ప్రకాశం.. కడప జిల్లాల్లోనూ తీవ్ర ఎక్కువ అవుతుందంటున్నారు. అదే సమయంలో విజయనగరం.. కర్నూలు జిల్లాల్లో కేసుల నమోదు క్రమంగా తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. వైరస్ వ్యాప్తి ఏ జిల్లాల్లో ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకునేందుకు నిర్వహించిన ఈ సర్వే ఫలితం సంపూర్ణ స్పష్టత వచ్చేలా చేసినట్లు చెబుతున్నారు.