Begin typing your search above and press return to search.
వాళ్ల నిర్లక్ష్యం.. కొంప ముంచుతోంది
By: Tupaki Desk | 6 Sep 2020 12:30 AM GMTవైద్యాధికారుల నిర్లక్ష్యం కొంప ముంచుతోంది. కరోనా పరీక్షలు చేయించుకున్న నెలరోజులైనా ఫలితాలు రావడం లేదు. దీంతో టెస్టులు చేయించున్న వాళ్లు యథావిధిగా అందరితో కలిసి తిరుగుతున్నారు. కరోనాను అందరికీ అంటిస్తున్నారు. విశాఖపట్టణంలో ఓ యువకుడిని నెల తర్వాత కరోనా ఫలితం వచ్చింది. ఈ లోపు అతడు భార్య పిల్లలకు, ఇరుగుపొరుగు వారికి రోగం అంటించాడు.
విశాఖపట్టణం.. తాటిచెట్లపాలెం ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి గత నెల 20న కరోనా పరీక్ష చేయించుకున్నాడు. వారంపాటు ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. అయినా ఫలితం రాలేదు. మరోవైపు ఊపరిఆడకపోవడంతో ఓ ప్రైవేట్ ల్యాబ్‌కు వెళ్లి పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందని.. వెంబడే ఫలితాలు చెప్పిఉంటే ఈ పాటికే తనకు రోగం తగ్గి ఉండేదని అతడు వాపోతున్నాడు. అనకాపల్లి కి చెందిన ఓ వ్యక్తి పనిచేసే ఫ్యాక్టరీలో కరోనా రావడంతో పరీక్ష చేయుంచుకున్నాడు. వారం పూర్తయినా ఫలితం రాకపోవడంతో నెగిటివ్ గా భావించి అందరితోపాటు కలిసి తిరగడం ప్రారంభించాడు. తొమ్మిదో రోజు ఫలితాలు వచ్చాయి. ఈ లోపే అతడి కుటుంబసభ్యులకు, స్నేహితులకు, ఇరుగుపొరుగువారికి కరోనా సోకింది.
విశాఖ పట్టణం జిల్లాలో ప్రతిరోజు వేలమందికి కరోనా పరీక్షలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ ఫలితాలు మాత్రం సకాలంలో రావడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫలితాలు ఆలస్యంగా ఇవ్వడం వల్ల నెగిటివ్ వచ్చిందని భావించి కొందరు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. దీంతో ఇతరులకు తేలికగా అంటిస్తున్నారు. మరికొందరు ఫలితాల కోసం ఎదురు చూస్తూ మానసికంగా కుంగిపోతున్నారు. అధికారులు వీలైనంత తొందరగా ఫలితాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.