Begin typing your search above and press return to search.
తండ్రి కరోనా తో మృతి ..గోదావరిలో దూకి భార్య పిల్లలు ఆత్మహత్య !
By: Tupaki Desk | 19 Aug 2020 6:00 AM GMTకరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగుల్చుతుంది. కరోనా ఉదృతి రోజురోజుకి పెరిగిపోతుంది. అలాగే కరోనా కారణంగా చనిపోయే వారి సంఖ్య కూడా రోజురోజుకి పెరిగిపోతుంది. అయితే కరోనాతో మృతిచెందేవారు కొందరైతే .. కుటుంబ సభ్యులు కరోనాతో చనిపోయారని కొందరు , కరోనా సోకిదేమో అని కొందరు ఆత్మహత్య కి పాల్పడుతున్నారు. ఈ మధ్య ఇలాంటి ఘటనలు ఎక్కువైయ్యాయి. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి జరిగింది. ఇంటిపెద్ద కరోనాతో చనిపోవడం ఆ కుటుంబసభ్యులు భరించలేకపోయారు.దీంతో మనస్థాపం చెందిన వారు గోదావరిలో నదిలో దూకారు. ఈ విషాద ఘటన పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని కొవ్వూరు మండలం పసివేదలలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.
పూర్తి వివరాలు చూస్తే .. . పసివేదలకు చెందిన నరసయ్యకు భార్య పరిమి సునీత, కుమారుడు ఫణికుమార్, కుమార్తె అన్నపూర్ణ ఉన్నారు. ఆయనకి కరోనా సోకి ఈ నెల 16న మృతి చెందారు. అయితే , ఇంటి పెద్ద చనిపోయినా కూడా బంధువులు, స్థానికులు సైతం పలకరించడానికి రాకపోవడం కుటుంబ పెద్ద చనిపోవడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఈ సమయంలోనే నరసింహారావు చెల్లెలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా .. స్థానిక మండల పరిషత్ కార్యాలయం నుంచి సమాచారంతో ఆమెను కొవ్వూరులో క్వారంటైన్ సెంటర్ కు తీసుకెళ్లడానికి కారులో వెళ్లారట. అక్కడి నుండి తల్లి సునీత, చెల్లి అపర్ణతో సహా నరసింహరావు కుమారుడు ఫణి కుమార్ వెళ్లి రైలు వంతెన దగ్గర ఉన్న గోదావరిలోకి దూకేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరసింహారావు కుమారుడు ఫణి కుమార్ మైనింగ్ విద్యలో గోల్డ్ మెడల్ సాధించాడు. ప్రస్తుతం గుజరాత్‌లో ప్రైవేట్ సంస్థలో మైనింగ్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. కుమార్తె పరిమి లక్ష్మీ అపర్ణ క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపిక అయ్యింది.. టీసీఎస్ లో కొద్ది రోజులుగా పనిచేస్తోంది.