Begin typing your search above and press return to search.
ఏపీ కరోనా అప్డేట్ .. ఎంతమంది కోలుకున్నారంటే?
By: Tupaki Desk | 18 Aug 2020 5:45 AM GMTఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. సోమవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 6,780 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలో నమోదు అయిన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,609కు చేరుకుంది. కొత్తగా తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒక్కరోజే 911 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో మొత్తం 44,578 నమూనాలను పరీక్షించగా 6780 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. అలాగే, రికవరీ సంఖ్య భారీగా నమోదవుతోంది. ఇప్పటివరకు ఏపీలో 2,09,100 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్ర సహా మరి కొన్ని రాష్ట్రాల్లో కూడా రికవరీ రేటు రెండు లక్షలను దాటినా కూడా .. వేగంగా ఈ మార్క్ ను దాటేసిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది.
ఇక , కర్నూలు జిల్లాలో కరోనా నుండి కోలుకొని డిశ్చార్జి అయిన పేషెంట్ల సంఖ్య అధికంగా నమోదైంది. ఈ జిల్లాలో ఇప్పటిదాకా 26,407 మంది డిశ్చార్జి అయ్యారు. తూర్పు గోదావరి జిల్లా రెండో స్థాయిలో నిలిచింది. ఈ జిల్లాలో 26,049 మంది ఇప్పటిదాకా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి స్వస్థలానికి చేరుకుని కరోనా వైరస్ బారిన పడిన వారిలో 2461 మంది. ఇతర దేశాల నుంచి స్వస్థలానికి వచ్చిన వారిలో 434 మంది కోలుకున్నారు.
జిల్లాలవారీగా అనంతపురం-24,300, చిత్తూరు-14,673, గుంటూరు-18,938, కడప-12,679, కృష్ణా-9208, నెల్లూరు-12,334, ప్రకాశం-7351, శ్రీకాకుళం-9830, విశాఖపట్నం-19,524, విజయనగరం-6222, పశ్చిమ గోదావరి-18,690 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 84,777 మంది పేషెంట్లు కరోనా తో పోరాడుతున్నారు. ప్రస్తుతం వీరందరూ ఆసుపత్రులు, కరోనా కేర్ సెంటర్లు, ఐసొలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య కూడా ఏపీలో భారీగా నమోదవుతోంది. ఇప్పటిదాకా 2732 మంది మరణించారు. అత్యధిక మరణాలు కర్నూలు, గుంటూరు జిల్లాల్లో నమోదు అయ్యాయి. కరోనా వైరస్ పేషెంట్లకు నాణ్యమైన చికిత్స, ఆహారాన్ని అందిస్తున్నందు వల్లే రికార్డు సమయంలో రెండు లక్షల మార్క్‌ను అందుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.