Begin typing your search above and press return to search.
500 మంది గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న పెళ్లికొడుకు
By: Tupaki Desk | 17 Aug 2020 7:10 AM GMTఅన్ని తెలిసి కూడా తప్పు చేసే వారిని ఏమనాలి? మితిమీరిన ఆత్మవిశ్వాసం.. అందుకు తోడుగా నిలిచే స్వార్థంతో పాటు.. ఏం కాదన్న భరోసా.. వెరసి తప్పుల మీద తప్పుల్ని చేసేలా చేస్తుది. ఇలాంటి వారి కారణంగా వందలాది మంది తిప్పలు పడే కొన్ని ఉదంతాలు కరోనా వేళ తెర మీదకు వస్తున్నాయి. తాజా ఉదంతం ఈ కోవకే వస్తుంది. విశాఖ జిల్లాలో చోటు చేసుకున్న ఒక పెళ్లి ఇప్పుడు వందలాది మంది గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. కరోనా వేళ.. పెళ్లి చేసుకుంటే యాభై మందికి మించి చేసుకోకూడదన్న నిబంధన స్పష్టంగా ఉంది. అయినప్పటికీ గొప్పలకు పోవటంతో పాటు.. ఏం కాదన్న అనవసరమైన ధీమా వారు తప్పు చేయటమే కాదు.. మిగిలిన వారి చేత తప్పులు చేసేలా చేస్తోంది.
విశాఖ జిల్లా కోటవురట్ల మండలం కొడవటిపూడికి చెందిన యువకుడు హైదరాబాద్ శివారులో జాబ్ చేస్తుంటాడు. అతడికి పెళ్లి ఫిక్స్ చేశారు. దీంతో ఇరవై రోజుల క్రితం సొంతూరు వచ్చాడు. మొదట్లో బాగానే ఉన్నా.. కరోనా లక్షణాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 5న కోవిడ్ పరీక్ష చేయించుకున్నాడు. రిపోర్టు ఎంతకు రాలేదు. రోజులు గుడుస్తున్నా రిపోర్టు రాకపోవటం.. దాని గురించి పట్టకుండా పెళ్లికి రెఢీ అయ్యాడు. ముందుగా అనుకున్న ముహుర్తంలో భాగంగా ఈ నెల 15న పెళ్లి చేశారు.
చర్చిలో జరిగిన ఈ పెళ్లికి దాదాపు 500 మంది వరకు హాజరయ్యారు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా.. ఇక్కడే సీన్ తేడా కొట్టింది. దాదాపుపది రోజుల క్రితం చేయించుకున్న కరోనా టెస్టు ఫలితం ఆగస్టు 16న అంటే ఆదివారం వచ్చింది. దీంతో పెళ్లి కొడుకుతో పాటు.. పెళ్లికి హాజరైన వారంతా ఇప్పుడు టెన్షన్ తో వణికిపోతున్నారు. పెళ్లికి తొంభై మంది వరకు హాజరైతే.. భోజనాలకు ఏకంగా 500 మంది హాజరయ్యారట. దీంతో ఇప్పుడు ఆ గ్రామంలోని వారంతా కరోనా భయంతో వణికిపోవటంతో పాటు.. టెస్టుల కోసం పరుగులు తీస్తున్నట్లు చెబుతున్నారు. పెళ్లికి పిలిస్తే మాత్రం.. కరోనా వేళ వెళ్లటం ఎంత రిస్కు అన్నది తాజా ఉదంతాన్ని చూస్తే అర్థం కాక మానదు.