Begin typing your search above and press return to search.

షాకింగ్: అన్ని దేశాల కేసులు కలిపినా ఏపీ కేసుల కంటే తక్కువే

By:  Tupaki Desk   |   10 Aug 2020 12:40 PM IST
షాకింగ్: అన్ని దేశాల కేసులు కలిపినా ఏపీ కేసుల కంటే తక్కువే
X
ఏపీలో కరోనా కేసుల తీవ్రత ఎంతన్నది తెలుసుకోవటానికి ఇప్పుడు చెప్పే ఒక పోలిక విషయ తీవ్రతను అర్థమయ్యేలా చేయటమే కాదు.. ఏపీ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తుంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో నమోదవుతున్న రోజువారీ కేసుల కంటే కూడా ఏపీలో నమోదవుతున్నకేసుల సంఖ్య భారీగా ఉండటం గమనార్హం.

ఉదాహరణకు జర్మనీ.. ఇటలీ.. పాకిస్థాన్.. బ్రిటన్.. సౌదీ.. ఇరాన్.. ఆదివారం ఒక్కరోజులో నమోదైన కేసుల కంటే కూడా ఒక్క ఏపీలో నమోదైన కేసులు ఎక్కువ కావటం గమానర్హం. ఈ దేశాల్లో ఆదివారం ఒక్కరోజులో నమోదైన కేసులు (475+463+634+1062+1428+2020) 6082 మాత్రమే. కానీ.. ఏపీ ఒక్క రాష్ట్రంలో నమోదైన కేసులు ఎన్నో తెలుసా? అక్షరాల 10,820. అంటే.. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఒక్కరోజు నమోదైన కేసుల్ని కలిపినా కూడా ఏపీ కంటే తక్కువగా ఉండటం చూస్తే.. ఏపీలో కరోనా తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో తెలుస్తుంది.

ప్రపంచ దేశాల్ని వదిలేద్దాం. దేశంలోని రాష్ట్రాల్ని చూసినా.. హరియాణ.. జమ్ముకశ్మీర్.. మధ్యప్రదేశ్.. పంజాబ్.. గుజరాత్.. తెలంగాణ.. రాజస్థాన్.. ఢిల్లీ.. (789+ 463+859+998+1101+1982+1171+1404) లో నమోదైన కేసులు ఏపీ కంటే చాలా తక్కువగా ఉండటం గమనార్హం. ఇదంతా చూసినప్పుడు..ప్రపంచంలోనూ.. దేశంలోని పలు రాష్ట్రాల్లో నమోదైన కేసుల్ని చూసినప్పుడు ఏపీలో కేసుల తీవ్రత ఎంత ఎక్కువ ఉందో అర్థం కాక మానదు. ఏపీ ప్రజలారా బీకేర్ ఫుల్.