Begin typing your search above and press return to search.
తిరుమలలో కరోనా.. దర్శనాలు నిలిపివేయాలా?
By: Tupaki Desk | 29 July 2020 7:10 AM GMTఅఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమలేషుడి దర్శనం కోసం దేశంలోని భక్తులంతా తరలివస్తుంటారు. కిలోమీటర్ల కొద్దీ క్యూలు చూసిన వారికి ఇప్పుడు కరోనా వైరస్ తో ఖాళీగా దర్శనమిస్తున్న క్యూలను చూసి జీర్ణించుకోలేకపోతున్నారు.
అయితే దర్శనాలకు అనుమతిచ్చినా కూడా పెద్దగా జనాలు రావడం లేదు. వైరస్ భయాన్ని జనాన్ని ఆవహించడంతో దర్శనాలపై కూడా ప్రభావం పడింది.
ఇక తిరుమల, తిరుపతిలో కరోనా తీవ్రంగా ప్రబలుతోంది. ఆలయ అర్చకులకు పాకింది. దీంతో తిరుమల కొండకు వెళ్లే శ్రీవారి మెట్టు మార్గాన్ని టీటీడీ పూర్తిగా మూసేసింది. ఇక అలిపిరి మార్గాన్ని ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకే తెరుస్తోంది. అడుగడుగునా కట్టుదిట్టమైన కరోనా నివారణ చర్యలు చేపట్టారు.
అయినా కూడా తిరుమల పెద్ద జీయర్ తోపాటు మరో 15మంది అర్చకులకు కరోనా పాజిటివ్ గా వచ్చింది. టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు ఒకరు.. మరో ఉద్యోగి కరోనాతో మరణించారు.
దర్శనాలు ప్రారంభించిన తర్వాతే తిరుమలలో కరోనా ప్రబలింది. భక్తులు స్వామి వారిని చూసిన తన్మయత్వంలో గోవిందా అంటూ కీర్తిస్తున్నారు. వారిలోని కరోనా తుంపర్లు ఆలయ గర్భగుడిలోని అర్చకులకు సోకుతున్నాయి. బయటకు.. లోపలికి వెళ్లడానికి ఒకే దారి ఉండడంతో భక్తుల నామస్మరణతో ఆ పరిసరాలు కరోనా మయంగా మారుతున్నాయి. ఇలా అర్చకులకు కరోనా సోకుతోందని తేలింది.
ఇక తిరుపతిలో కరోనా ప్రబలుతోంది. తిరుమల అర్చకులంతా కొండ కింద తిరుపతిలోనే నివాసం ఉంటారు.రోజూ రాకపోకల వల్ల కరోనా వ్యాపిస్తోంది.
నిజానికి లాక్ డౌన్ వేళ తిరుమలలో కేసులు నమోదు కాలేదు. ప్రస్తుతం దర్శనాల తర్వాతే పెరిగాయి.కాబట్టి దర్శనాలు ఆపేస్తే తిరుమలకు వచ్చేనష్టం ఏమీ లేదు. వందల కోట్ల రాబడి ఉన్న తిరుమల భరించగలదు. స్వామికి అర్చకులు అన్ని ఆరాధనా కార్యక్రమాలు ఏకాంతంగా చేస్తారు. సో దర్శనాల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తిరుమలలో కరోనాను కంట్రోల్ చేసిన వారు అవుతారు.