Begin typing your search above and press return to search.
కరోనా కేంద్రం నుండి ఖైదీలు పరార్ !
By: Tupaki Desk | 25 July 2020 7:45 AM GMTపశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సీఆర్ ఆర్ కరోనా కేంద్రం నుండి ఇద్దరు ఖైదీలు పారిపోయారు. ఈ రోజు తెల్లవారుజమున ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా జైల్లో ఖైదీలకు కరోనా సోకడంతో 13 మందిని సిబ్బంది కరోనా కేంద్రానికి తరలించారు. వీరిలో పలు చోరీ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న ఇద్దరు ఖైదీలు పారిపోవడానికి ఇదే అదునైన సమయం అని భావించి శనివారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల ప్రాంతంలో కరోనా కేంద్రం నుంచి గుట్టుచప్పుడు కాకుండా పరారయ్యారు.
ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. జంగారెడ్డిగూడెం, భీమవరానికి చెందిన ఇద్దరు నిందితులు పలు చోరీ కేసుల్లో అరెస్టయి ఏలూరు జిల్లా జైలులో ఏడాది నుంచి రిమాండ్ ఖైదీలుగా ఉంటున్నారు. వీరితో పాటు మొత్తంగా 13 మందికి కరోనా సోకడం వారిని ఏలూరు సీఆర్ ఆర్ కరోనా కేంద్రానికి తరలించారు. అక్కడి నుండి వారిద్దరూ పారిపోయారు. ఈ మాచారం తెలుసుకున్న పోలీసులు వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. కరోనా సెంటర్ లో చికిత్స పొందుతున్న మిగిలిన ఖైదీలకు ఎస్కార్ట్ ను అప్రమత్తం చేశారు. ఖైదీలు పరారైనా ఏలూరు సీఆర్‌ఆర్ కోవిడ్ సెంటర్‌ను ఎస్పీ నారాయణ నాయక్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరారైనా నిందితులను పట్టుకుంటామని తెలిపారు. పారిపోయిన ఇద్దరు ఖైదీలు ఇంటి చోరీ కేసుల్లో నేరస్తులని వెల్లడించారు.