Begin typing your search above and press return to search.
ఆ ఇంజెక్షన్ల కోసం జగన్ సర్కారు రూ.50 కోట్ల ఖర్చు?
By: Tupaki Desk | 25 July 2020 3:45 AM GMTజగన్ సర్కారు విడుదల చేసిన ఒక ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కరోనా మెడలు వంచేందుకు దేనికైనా సిద్ధమని చెబుతున్న జగన్ సర్కారు అందుకు తగ్గట్లే.. తాజాగా రూ.వెయ్యి కోట్లను విడుదల చేస్తున్నట్లు చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం. కరోనా మీద చేసే యుద్ధం కోసం అవసరమైతే రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పారే తప్పించి.. ఇప్పటివరకూ ఎన్ని వందల కోట్లు ఖర్చు చేశారన్న దానికి లెక్కలు బయటకు రాని పరిస్థితి.
జగన్ సర్కారు విషయానికి వస్తే.. కరోనా రోగులకు స్వస్థత కోసం భారీగా నిధుల విడుదల చేసేందుకు తమ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్న విషయాన్ని చెప్పటమే కాదు.. చేతల్లో చేసి చూపించింది. తాము విడుదల చేసిన వెయ్యి కోట్ల నిధుల్ని ఏ తీరులో ఖర్చు అవుతాయన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసింది. ఈ లెక్కలు చెప్పే క్రమంలో ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. ఒక్క ఇంజెక్షన్ కోసమే జగన్ ప్రభుత్వం రూ.50 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. అదెలానంటే.. కరోనా పాజిటివ్ లో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న వారిని రక్షించుకునేందుకు ఇటీవల రెమ్ డెసివిర్.. టోసీలిజుమబ్ లాంటి యాంటీ వైరల్ డ్రగ్ లు వచ్చాయి. వీటిని పెద్ద మొత్తంగా అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొంది. ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో సంస్థ రెమ్ డెసివిర్ ను ఉత్పత్తి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ లో భాగంగా సదరు కంపెనీ ఇప్పటికే 5వేల డోసుల్ని రాష్ట్రంలోని ఆసుపత్రులకు పంపినట్లు పేర్కొన్నారు.
మరో 15వేల డోసులు కూడా ఈ రోజు (శనివారానికి)కు వచ్చేస్తాయన్నారు. ఆగస్టు మూడో వారానికి మరో 70 వేల డోసులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. మొత్తం 90వేల డోసుల రెమ్ డెసివిర్ డోసులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఒక్కో రోగికి ఐదు నుంచి ఏడు డోసల వరకు ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇందుకోసం సరాసరిన ఒక్కో రోగికి రూ.35వేలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎందుకంటే ఒక రోగికి ఈ ఇంజెక్షన్లను కనీసం ఐదు నుంచి ఏడు వరకు అవసరమవుతాయని చెబుతున్నారు.
ప్రతి వంద మంది పాజిటివ్ రోగుల్లో 7 నుంచి 8 మందికి ఈ ఇంజెక్షన్ల అవసరం ఉంటుందట. జగన్ సర్కారు తెప్పిస్తున్న 90వేల డోసులు దగ్గర దగ్గర 2లక్షల పాజిటివ్ కేసులు వచ్చినా సరిపోతాయని అధికారులు లెక్కలు గడుతున్నారు. ఇదంతా చూసినప్పుడు.. ఒక్క ఇంజెక్షన్ కోసమే జగన్ ప్రభుత్వం దగ్గర దగ్గర రూ.50కోట్లు ఖర్చు చేయటం గమనార్హం. కోవిడ్ పరీక్షల కోసం రోజు రూ.5కోట్లు.. క్వారంటైన్ సెంటర్లలో భోజనం.. పారిశుద్ధ్యం కోసం రోజూ రూ.1.5కోట్లు ఖర్చు పెడుతున్నట్లుగా తేల్చారు. ప్రజల ఆరోగ్యం.. వారికి సరైన వైద్యం కోసం.. వసతుల కల్పనలో రాజీ పడేది లేదనే మాటకు తగ్గట్లేజగన్ సర్కారు తీరు ఉండటం విశేషం.