Begin typing your search above and press return to search.

అనంతపురంలో దారుణం : భార్య కళ్లముందే ఆస్పత్రి ప్రాంగణంలో ప్రాణాలు వదిలిన భర్త !

By:  Tupaki Desk   |   24 July 2020 12:11 PM GMT
అనంతపురంలో దారుణం : భార్య కళ్లముందే  ఆస్పత్రి ప్రాంగణంలో ప్రాణాలు వదిలిన భర్త !
X
ప్రభుత్వాసుపత్రి నిర్లక్ష్యానికి మరో నిండు ప్రాణం బలైపోయింది. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో దారుణం చోటుచేసుకుంది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు అని హాస్పిటల్ కి తీసుకువస్తే .. హాస్పిటల్ సిబ్బంది ఏవేవో కారణాలతో ఆసుపత్రిలో జాయిన్ చేసుకోలేదు. తన భర్త ప్రాణాలతో పోరాడుతున్నదని , శ్వాస తీసుకోవడం,కష్టంగా ఉందని దయచూపి సిబ్బంది చుట్టూ భార్య ఇష్టం వచ్చినట్టు తిరిగింది. కానీ , ఎవరు స్పందించలేదు. రాత్రి అంతా కూడా హాస్పిటల్ బయటే ఉంచారు. తెల్లవారు జామున అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ప్రాణాలు కోల్పోయాడు.

అనంతపురం జిల్లా ధర్మవరం గ్రామానికి చెందిన రాజా శ్వాసకోశ సమస్యతో ఇబ్బందిపడుతున్నాడు. తాజాగా ఆ సమస్య ఎక్కువ కావడంతో భార్య,కుమార్తె కలిసి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకోని వచ్చారు. కానీ, అక్కడ ఆస్పత్రి వార్డులో చేర్చుకునేందుకు సిబ్బంది నిరాకరించారు. ఎంత బ్రతిమిలాడినా కూడా ఎవరు స్పందించలేదు. దీనితో హాస్పిటల్ బయటే ఉన్నారు. ఓవైపు భర్త అనారోగ్య సమస్య, మరోవైపు ఏ మాత్రం మానవత్వం లేని సిబ్బంది కారణంగా నిస్సహాయ స్థితిలో ఏడుస్తూ ఉండిపోయింది. రాజా ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో తెల్లవారుజామున ఆస్పత్రి ఆవరణలోని ఓ చెట్టు కింద ప్రాణాలు విడిచాడు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగానే నా భర్త మృతి చెందాడు అని ఆమె ఆరోపణలు చేసింది.

ఈ ఘటనపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్‌లో స్పందించారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా. ప్రజలు రోడ్ల మీదే ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకునే వారు లేరు. అనంతపురం జిల్లా ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన ముఖ్యమంత్రి జగన్ అసమర్థ ప్రభుత్వ పనితీరుకి ఉదాహరణ అని విమర్శించారు. ఆటోలో హాస్పిటల్ కి తీసుకువచ్చి, 8 గంటల పాటు ప్రాణాలు పోతున్నాయి, కాపాడాలని ప్రాధేయపడినా కనికరం చూపించడంలేదు. వైద్యం అందక అతను చెట్టు కిందే ప్రాణాలు కోల్పోయారు.' అంటూ తన ట్వీట్‌ లో తెలిపాడు.