Begin typing your search above and press return to search.

నవ వరుడికి కరోనా పాజిటివ్ ...భార్య కోసం ఆస్పత్రి నుండి పరార్

By:  Tupaki Desk   |   24 July 2020 10:50 AM GMT
నవ వరుడికి కరోనా పాజిటివ్ ...భార్య కోసం ఆస్పత్రి నుండి పరార్
X
కరోనా వైరస్ లాక్‌ డౌన్ కొనసాగుతున్నప్పటికీ పలు సడలింపులు ఉండటంతో దేశంలో అక్కడక్కడా వివాహాది శుభకార్యాలు జరుగుతున్నాయి. అయితే, ఇలాంటి కార్యక్రమాల్లో భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడంతో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అలాగే, ప్రభుత్వం పెళ్లి కోసం ఎమ్మెర్వో ఆఫీసుల్లో అనుమతి తప్పనిసరి చేసింది. ఆ పెళ్లికి హాజరయ్యే వారి వివరాలను వెల్లడించడంతో పాటుగా, కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. దీంతో పెళ్లికి ముందే అందరూ పరీక్షలు చేయించుకుంటున్నారు.

అయితే , ఆ కరోనా టెస్టుల రిపోర్ట్స్ రావడానికి కొంచెం ఆసల్యం అవుతుంది. అక్కడే పొరపాటు జరుగుతుంది. కొంతమందికి పెళ్ళైన తరువాత కరోనా పాజిటివ్ అని తేలింది. ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. పెళ్లి కొడుకు తాళి కట్టిన మరుక్షణమే కరోనా పాజిటివ్ అంటూ ఆసుపత్రికి తరలించిన ఘటనలని కూడా మన చూసాం. అలాగే పెళ్ళికి అంతా ఫిక్స్ చేసిన తర్వాత ముహూర్తానికి కొద్దీ సమయమే ఉన్న సమయంలో కూడా కరోనా పాజిటివ్ అని తేలడంతో కొన్ని పెళ్లిళ్లు మధ్యలోనే ఆగిపోయాయి.

తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. ప్రకాశం జిల్లా తర్లుపాడుకు చెందిన ఓ వ్యక్తికి ఈ మద్యే పెళ్లి అయింది. నవ వరుడికి కరోనా పాజిటివ్‌ గా తేలడంతో మార్కాపురంలోని కరోనా‌ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం ఉదయం ఆస్పత్రి నుంచి బయటకెళ్లి చాలా సమయం అయినా కూడా తిరిగిరాలేదు. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా బాధితుడి పరారీపై మార్కాపురం గ్రామీణం, తర్లుపాడు పోలీసులకు సమాచారమిచ్చారు.అయితే , కరోనా బాధితుడికి ఇటీవల వివాహం కావడంతో... భార్య, బంధువులు గుర్తొచ్చి ఇంటికి వెళ్లిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. సాయంత్రానికి తిరిగి మార్కాపురం కొవిడ్‌ వైద్యశాలకు తరలించారు.