Begin typing your search above and press return to search.
రోటీన్ కు భిన్నంగా తూర్పుగోదావరి జిల్లాలో ఆ పెళ్లి ఎపిసోడ్
By: Tupaki Desk | 24 July 2020 6:00 AM GMTఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవటమే పెద్ద పనిష్ మెంట్ గా మారింది. జీవితంలో ఒక్కసారి చేసుకునే పెళ్లిని.. ఆదరాబాదరాగా.. అయినోళ్లు ఎవరూ చుట్టూ లేకుండా.. మహా అయితే యాభై మందిని దాటకుండా వేడుకను పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి తాజాగా నెలకొంది. ఇలాంటివేళ.. తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకున్న ఒక పెళ్లి వేడుక అనుకోని రీతిలో వార్తాంశంగా మారిపోయింది. ఇంతకూ ఏం జరిగిందంటే?
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో జరగాల్సిన పెళ్లిలో ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మరికాసేపట్లో పెళ్లి జరగాల్సిన వేదిక ఒక్కసారి బోసి పోవటమే కాదు.. అక్కడకు వచ్చిన వారంతా క్షణాల్లో జారుకునే పరిస్థితి. మరికొందరైతే.. తామెందుకు పెళ్లి వేడుక్కి ఎందుకు వచ్చామా? అని తమను తాము తిట్టుకునే దుస్థితి. ఇంతకీ ఏం జరిగిందంటారా? అక్కడికే వస్తున్నాం.
గోదావరి జిల్లాలోని కొత్తపేటలో పెళ్లి వేడుక హుషారుగా సాగుతోంది. ఆంక్షల నేపథ్యంలోనూ అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి వేడుకను చేసుకుంటూ అస్వాదిస్తున్నాడు. ఇంతలో పెళ్లి కుమారుడి ఫోన్ కు ఒక మెసేజ్ వచ్చింది. దాన్ని చూసినంతనే సదరు వ్యక్తి గుండె కిందకు జారింది. పెళ్లి పనుల్లో పడి ఆరోగ్యాన్ని పట్టించుకోని పెళ్లికొడుక్కి ఇటీవల జ్వరం వచ్చింది. దీంతో.. కరోనా పరీక్ష చేయించుకున్నాడు. రిజల్ట్ పాజిటివ్ గా రావటంతో ఏం చేయాలో తోచని పరిస్థితి.
తనకు వచ్చిన ఫలితాన్ని చెప్పి.. పెళ్లి వాయిదా వేశారు. ఇక.. ఎవరికి వారు జారుకున్నారు. పెళ్లి కొడుకును క్వారంటైన్ కు తరలించారు. పెళ్లి ముచ్చట తర్వాత చూద్దామని డిసైడ్ చేశారు. మరోవైపు పెళ్లి హడావుడిలో అప్పటివరకూ మునిగి తేలిన వారంతా ఇప్పుడు భయాందోళనలకు గురై.. కరోనా నిర్దారణ పరీక్షల కోసం బారులు తీరినట్లుగా తెలుస్తోంది. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా.. పెళ్లి కొడుక్కి పాజిటివ్ రావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. జిల్లా వ్యాప్తంగా ఈ పెళ్లి గురించి చర్చ జరుగుతుండటం గమనార్హం.