Begin typing your search above and press return to search.
నెల్లూరు : ఒకే ఇంట్లో 9మందికి సోకిన కరోనా !
By: Tupaki Desk | 23 July 2020 6:00 AM GMTఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. రోజురోజుకి నమోదు అయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ప్రభుత్వం కరోనాను అరికట్టడానికి ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా కూడా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా ఏపీలో రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆరు వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో కరోనా జోరు ఏ విదంగా కొనసాగుతుందో.
ఇకపోతే , నెల్లూరు జిల్లా పై కరోనా పంజా విసురుతుంది. జిల్లాలో సామాన్యులతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది కూడా వైరస్ బారినపడుతున్నారు. తాజాగా కొడవలూరు మండల తహశీల్దార్ కార్యాలయంలో ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అనుమానంతో ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులకి కరోనా టెస్టులు చేయగా .. ఆ ఉద్యోగి కుటుంబంలో 9మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఉద్యోగికి, ఆయన ఫ్యామిలీ మెంబెర్స్ కి కరోనా వైరస్ సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా కొడవలూరు తహశీల్దార్, రెవెన్యూ సిబ్బంది అందరికీ కరోనా పరీక్షలు చేయించి , తహశీల్దార్ కార్యాలయాన్ని మూసివేశారు.
ఇకపోతే , ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలో మొత్తం కేసులు 3010 ఉంటే.. 988మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరో 2వేల మంది ఆస్పత్రుల్లో కరోనా కి చికిత్స తీసుకుంటున్నారు. అలాగే, జిల్లాలో ఇప్పటి వరకు 22మంది కరోనా భారిన పడి చనిపోయారు. తాజాగా మరో 327 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి అనిల్ కుమార్ కూడా అన్నారు.