Begin typing your search above and press return to search.

అసెంబ్లీ - సచివాలయంలో కరోనా కలకలం!!

By:  Tupaki Desk   |   23 July 2020 3:30 AM GMT
అసెంబ్లీ - సచివాలయంలో కరోనా కలకలం!!
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలయం చోటుచేసుకుంటోంది. టెస్టుల సంఖ్య భారీగా పెంచడంతో కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఏకంగా 6వేలు దాటుతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది.

సామాన్యులు.. ప్రజాప్రతినిధులు.. అధికారులు అన్న తేడా లేకుండా అందరికీ సోకుతూనే ఉంది. తాజాగా వైసీపీ నేతలు విజయసాయి.. అంబటి రాంబాబులకు కూడా కరోనా సోకినట్టు వార్తలు వచ్చాయి.

ఇక తాజాగా ఏపీ అసెంబ్లీ.. సచివాలయాల్లో ఉద్యోగులను కరోనా వదలడం లేదు. విస్తృతంగా వ్యాపిస్తూ ఉద్యోగుల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది.

బుధవారం అసెంబ్లీలో ఐదుగురు.. సచివాలయంలో ఏడుగురు ఉద్యోగులతోపాటు ఓ ఐఏఎస్ కు కూడా కరోనా సోకింది. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్యల సంఖ్య 74కు చేరింది.

ఇదే సమయంలో సచివాలయం.. అసెంబ్లీకి వచ్చే వారి ఐడీ కార్డులు.. బ్యాగులను భద్రతా సిబ్బంది ప్రతీరోజు పరిశీలించాల్సిన నేపథ్యంలో ఎవరి ద్వారా తమకు వైరస్ సోకుతుందోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల చెకింగ్ ను ఆపాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.