Begin typing your search above and press return to search.
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా ఉగ్రరూపం...ఎన్ని కేసులంటే?
By: Tupaki Desk | 18 July 2020 7:00 AM GMTఏపీలో నమోదు అయ్యే కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి భారీగా పెరిగిపోతుంది. ముఖ్యంగా గత మూడు రోజులుగా రాష్ట్రంలో ప్రతిరోజూ 2500 కి పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దీనితో రాష్ట్రంలో ఇప్పటివరకు 40 వేలకి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్ర ప్రజలతో పాటుగా అధికారుల్లో కూడా ఆందోలన మొదలైంది. ముఖ్యంగా కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని గట్టి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా రోజురోజుకి నమోదు అయ్యే కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో కర్నూల్ జిల్లా - తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు ఎక్కువుగా నమోదు అవుతున్నాయి. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలో 5564 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి అంటే కరోనా ప్రభావం జిల్లాపై ఎంతలా ఉందొ అర్థం చేసుకోవచ్చు.
తాజాగా జిల్లావ్యాప్తంగా శుక్రవారం 608 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రునాట్ - ఆర్ టీపీసీఆర్ లో 293 - ర్యాపిడ్ కిట్ల ద్వారా 315 నిర్ధారణ అయ్యాయి. మొత్తం కేసుల్లో అత్యధికంగా కాకినాడ నగరంలో 138 మందికి వైరస్ సోకినట్టు తేలింది. దీనితో కాకినాడలో కరోనా కేసుల సంఖ్య మొత్తం వెయ్యికి పైగానే నమోదు అయినట్టు తెలుస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలో ప్రతిరోజు నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా కాకినాడ లో నమోదు అవుతుండటంతో రెడ్ జోన్ లు రెట్టింపయ్యాయి. రాజమహేంద్రవరంలో 102 పాజిటివ్ లు గుర్తించారు. దాదాపు జిల్లాలోని పలు ప్రధాన నగరాల్లో అన్నిచోట్లాకరోనా కేసులు నమోదు అవుతున్నాయి.
పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు పీఏకు పాజిటివ్ గా వైద్యులు ధ్రువీకరించారు. ఇప్పటిరకు జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,564కు చేరాయి. మరో వైపు జిల్లాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్న వారిని మాత్రమే హాస్పిటల్స్ కు తరలిస్తున్నారు. పెద్దగా లక్షణాలు లేనివారిని, తక్కువ వయస్సు ఉన్న వారిని హోంఐసోలేషన్ లో పెడుతున్నారు. దీంతో ఇంట్లోనే కరోనాకి చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. అటు బుధవారం నుంచి పెరిగిన టెస్ట్ లకు అనుగుణంగా పెద్దఎత్తున వస్తున్న పాజిటివ్‌లతో అధికారులు మరింత అప్రమత్తం అవుతున్నారు. అలాగే , కోనసీమలోని బోడసకుర్రు లో కరోనా ఆస్పత్రిని సిద్ధం చేశారు. జూలై, ఆగస్టు నెలల్లో అత్యంత భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతాయని, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కొవిడ్ ప్రత్యేక అధికారి కృష్ణబాబు శుక్రవారం అధికారింగా వెల్లడించిన సంగతి తెలిసిందే.