Begin typing your search above and press return to search.
ఆకలి కేకలేస్తోన్న అగ్రరాజ్యం .. ఫుడ్ బ్యాంకుల ముందు ఎదురుచూపులు
By: Tupaki Desk | 16 Dec 2020 2:30 PM GMTకరోనా జోరు చూస్తుంటే , వ్యాక్సిన్ వచ్చినా కూడా ఇప్పట్లో ఈ మహమ్మారి పీడ వైదొలిగేలా లేదు, ఎందుకు అంటే , కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిందిలే అనుకునే సమయానికే , మరోవైపు కరోనా కేసులు కుప్పలు తెప్పలుగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కరోనా మహమ్మారి కారణంగా జనజీవనం లో పూర్తిగా మార్పులు వచ్చాయి. ఆకలి చావులు కూడా చూస్తూనే ఉన్నాం. ఇక అమెరికా లో కరోనా మహమ్మారి కేసులు ఓ వైపు పెరుగుతుంటే , మరోవైపు పక్క ఆహర బ్యాంకులకు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. దేశంలోని సంపన్న ప్రాంతాల్లో కూడా ఆహర కొరత స్పష్టంగా కనిపిస్తోంది. తమ కుటుంబాన్ని పోషించడానికి ఆహార బ్యాంకులపై ఆధారపడవలసి వస్తుందని చాలామంది భాదతో చెప్తున్నారు. ప్రపంచ దేశాలను తన కనుసన్నల్లో ఉంచుకొనే అగ్రరాజ్యం అది.. దేన్నైనా డబ్బులిచ్చి కొనేసుకోగల సామర్థ్యం ఆ దేశానిది.. కానీ, కరోనా దెబ్బకు ఆకలి అంటూ కేకలు వేస్తోంది. ఉపాధి లేక, తినడానికి తిండి లేక అమెరికా ప్రజలు అల్లాడిపోతున్నారు. ఫుడ్ బ్యాంకుల చుట్టూ తిరుగుతూ నిత్యావసరాల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు.
కరోనా కారణంగా ఉన్న ఉపాధి కోల్పోయి , తినడానికి తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు. కరోనా మహమ్మారి సంక్షోభం వల్ల కార్లా కుటుంబంలాగే అనేకమంది అమెరికన్లు రోడ్డున పడిపోయారని సెన్సస్ బ్యూరో డాటా చెబుతోంది.నవంబర్ లో ఎనిమిదిమంది అమెరికన్లలో ఒకరికి తరచుగా ఆహారం దొరకని పరిస్థితి ఉన్నదని ఇటీవల విడుదలైన సెన్సస్ సర్వేలో వెల్లడైంది. నవంబర్ లో సేకరించిన హౌస్ హోల్డ్ పల్స్ సర్వే డాటా ప్రకారం..దాదాపు 2.6 కోట్ల వయోజనులు అంటే వయోజనుల జనాభాలో 12% మంది గత వారం రోజుల్లో ఆహర కొరత ఎదుర్కొన్నారని తేలింది. మొత్తంగా, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆహార అభద్రత రెట్టింపయ్యిందని, 1998 నుంచీ ఇప్పటిదాకా నమోదైన అత్యధిక ఆహార అభద్రత స్థాయి ఇదేనని గణాంకాలు చెబుతున్నాయి.
నవంబర్ ప్రారంభంనుంచీ వారానికి 750నుంచీ 1,100 కుటుంబాలకు లౌడౌన్ ఆహార సహాయ కేంద్రం ఆహారాన్ని పంపిణీ చేస్తోంది. కరోనా కు ముందు గణాంకాలతో పోలిస్తే ఇది 225% అధికం. ఇంతకుముందెన్నడూ ఇక్కడకు రానివారిని అనేకమందిని ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం. చాలామంది ఉపాధి కోల్పోవడంతో తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కుంటున్నారు" అని లౌడౌన్ ఆహార సహాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జెన్నీఫర్ మోంట్గోమేరీ తెలిపారు. యూఎస్ లో సంపన్నమైన శాన్ ఫ్రాన్సిస్కో, మరీన్ ప్రాంతాల్లో పని చేసే శాన్ ఫ్రాన్సిస్కో, మరీన్ ఆహార బ్యాంకు కరోనా కు ముందుకన్నా రెట్టింపు స్థాయిలో 60,000లకు పైగా కుటుంబాలకు ఆహారం అందిస్తోందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాల్ యాష్ తెలిపారు.
మహమ్మరికి ముందు వృద్ధులు, నిరుద్యోగులు అధికంగా ఆహార బ్యాంకులపై ఆధారపడేవారు. కానీ ఇప్పుడు సేవారంగంలో ఉపాధి కోల్పోయిన కార్మికులు అధికంగా వస్తున్నారని పాల్ యాష్ తెలిపారు. క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితులే ఇందుకు కారణమని ఆర్థిక శాస్త్రవేత్త, నార్త్ వెస్ట్ యూనివర్సిటీకి చెందిన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పాలసీ రిసెర్చ్ డైరెక్టర్ డైనే విట్‌మోర్ షంజెంబాక్ అభిప్రాయపడ్డారు. మార్చి చివర్లో ఆహార అభద్రత అనూహ్యంగా పెరిగిపోయింది. కానీ లాక్ డౌన్ తరువాత మెల్లమెల్లగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం, ఫెడరల్ రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించడంతో పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. కానీ క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితుల వలన ఆహార అభద్రత పెరుగుతోందని ప్రొఫెసర్ డైనే విట్ మోర్ అంటున్నారు.