Begin typing your search above and press return to search.

అమెరికాలో రికార్డ్.. ఒక్కరోజులో అత్యధిక కేసులు

By:  Tupaki Desk   |   16 July 2020 12:00 PM IST
అమెరికాలో రికార్డ్.. ఒక్కరోజులో అత్యధిక కేసులు
X
అమెరికాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రతిరోజు భయానకరీతిలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అమెరికా దక్షిణ.. నైరుతి రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో ఆయా రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలు కూడా మళ్లీ లాక్ డౌన్ దిశగా ఆలోచిస్తున్నాయి.

కొత్త కరోనా హాట్‌స్పాట్‌లుగా కాలిఫోర్నియా, ఫ్లోరిడా, అరిజోనా, టెక్సాస్ రాష్ట్రాలు మారుతున్నాయి. ఇంతకుముందు తీవ్రంగా ప్రబలిన న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల ప్రజలను ప్రస్తుతం ప్రబలుతున్న రాష్ట్రాలకు వెళ్లవద్దని.. పర్యటనలు, సందర్శనలు పెట్టుకోవద్దని మార్గదర్శకాలు విడుదల చేశాయి.. అమెరికాలోని టాప్ అంటు వ్యాధుల వైద్యుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ మాట్లాడుతూ ఒక రోజులో అమెరికాలో అప్పట్లో 20,000 కేసులు నమోదైతేనే తట్టుకోలేకపోతున్నాం.. ప్రస్తుతం ఈ కేసులు ప్రతిరోజూ 60000 దాటిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

డాక్టర్ ఫౌసీ ప్రస్తుత సంక్షోభాన్ని 1918 ఫ్లూ మహమ్మారితో పోల్చారు. ఇది ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్లకు పైగా ప్రజలను చంపింది. అమెరికాలో 6,75,000 కంటే ఎక్కువ మరణాలు ఇప్పటికే అయ్యాయి.

దేశంలో మంగళవారం భారీగా 67,417 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నాటికి అమెరికాలో వైరస్ సోకిన ప్రజల సంఖ్య 3.4 మిలియన్లకు చేరింది. దాదాపు 38 రాష్ట్రాల్లో గత వారం నుండి కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది.

ప్రస్తుతానికి అమెరికాలో అన్ని సంస్థలు ఉద్యోగులు, తమ వినియోగదారులకు ఫేస్-కవరింగ్ మాస్క్‌ను తప్పనిసరి చేశాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రిటైలర్ వాల్‌మార్ట్. తమ వినియోగదారులందరికీ జూలై 20 నుండి ముసుగులు ధరించే సరుకులు కొనాలని స్పష్టం చేసింది.. లేదంటే సరుకులు అమ్మమని తెలిపింది.