Begin typing your search above and press return to search.

ఉప్పు పసుపు కలిపి పుక్కిలిస్తే కరోనా ఖతం

By:  Tupaki Desk   |   25 Jun 2020 6:30 AM GMT
ఉప్పు పసుపు కలిపి పుక్కిలిస్తే కరోనా ఖతం
X
కరోనా వైరస్ కు మందు లేకపోవడం.. ఇంకా కనిపెట్టక పోవడం తో పతంజలి దగ్గరి నుంచి ప్రతీ మనిషి కూడా ఇలా చేస్తే కరోనా రాదంటూ లెక్చర్లు దంచుతూనే ఉన్నారు. అయితే వాటికి శాస్త్రీయ ఆధారాలు మాత్రం లేదు. కానీ నమ్మకాలు మాత్రం బలం గా ఉన్నాయి.

తాజాగా వేడి నీటిలో ఉప్పు, పసుపు కలిపి రోజుకు ఐదుసార్లు పుక్కిలిస్తే ప్రాథమిక స్థాయిలోనే కరోనా వైరస్ మహమ్మారిని నివారించవచ్చని తమిళనాడు మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ (టాంపా), అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏఐటీఎఫ్) అధ్యక్షుడు ప్రొ. డాక్టర్ సీఎంకే రెడ్డి ప్రజలకు సూచించారు.

తమిళనాడులో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సీఎంకే రెడ్డి తాజాగా ప్రజలకు ఈ సూచనలు చేశారు. 12 ఏళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్ల పైబడిన వృద్ధులు ఆరోగ్యంపట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్ల వల్ల దేశంలో మృతుల సంఖ్య తక్కువగా ఉందని ఆయన అన్నారు. ప్రజలు మిరియాలు, సొంఠి, జిలకర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, ఆవాలు తదితర వాటిని ఎక్కువ మోతాదులో వినియోగిస్తే వైరస్‌ నుంచి విముక్తి లభిస్తుందన్నారు