Begin typing your search above and press return to search.

బట్టతల ఉన్నవాళ్లకు కరోనా సోకితే డేంజర్​..!?

By:  Tupaki Desk   |   10 May 2021 10:30 AM GMT
బట్టతల ఉన్నవాళ్లకు కరోనా సోకితే డేంజర్​..!?
X
మన దేశంలో కరోనా డేంజర్​ బెల్స్​ మోగిస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్​వేవ్​ తో పోల్చుకుంటే.. సెకండ్​ వేవ్​ లో విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. వ్యాధి ఉధృతి కూడా ఎక్కువగా ఉంది. మరోవైపు మరణాల సంఖ్య అధికంగా ఉంది. మనదేశంలో ఆక్సిజన్​ కొరత వేధిస్తున్నది. వైద్య సదుపాయాలు కూడా లేవు. వ్యాక్సినేషన్​ పూర్తి స్థాయిలో జరగకపోవడంతో కేసుల సంఖ్య పెరుగుతున్నది.ఇదిలా ఉంటే కరోనా పై మరో కొత్త పరిశోధన ఆందోళన కలిగిస్తున్నది.

తాజా పరిశోధన ప్రకారం.. బట్టతల ఉన్నవాళ్లకు కరోనా సోకితే మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది!. చైనా శాస్త్రవేత్తలు ఈ మేరకు ఓ పరిశోధన చేశారు!. ప్రపంచవ్యాప్తంగా కరోనా చనిపోతున్నవారిలో అత్యధికులు బట్టతలతో బాధపడుతున్నవారేనని పరిశోధనలో తేలింది!.

సాధారణంగా బట్టతల మగాళ్లలోనే ఎక్కువగా వస్తుంది. అందుకు కారణం ఆండ్రోజెనెటిక్ అలోపెసియా (Androgenetic alopecia) అనే హార్మోన్ల లోపం. ఈ హార్మోన్ల లోపం ఉన్నవాళ్లకు బట్టతల వస్తూ ఉంటుంది. అయితే ఆండ్రోజెనెటిక్ అలోపెసియా అనే హార్మోన్​ లోపం ఉన్నవాళ్లకు కరోనా వైరస్​ తొందరగా సోకుతుందని!.. మరణాల రేటు కూడా ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ అంశమపై స్పెయిన్‌ లో పరిశోధనలు సాగాయి. అక్కడ కూడా ఆండ్రోజెన్ హార్మోన్లూ, కరోనా వైరస్ కు సంబంధం ఉందని తేలింది!. మొదటి పరిశోధనలో మాడ్రిడ్‌ లోని మూడు ఆస్పత్రుల్లో 122 మంది కరోనా పేషెంట్లను పరిశీలించారు. వారిలో 6 శాతం మందికి బట్టతల ఉంది. స్పెయిన్​ లో ఓ ఆస్పత్రిలో ఐసీయూలో చేరిన వారిని పరిశీలించారు. వారిలో దాదాపు 79 శాతం మందికి బట్టతల ఉంది. ఈ విషయంపై బ్రౌన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ కార్లోస్ వాంబియర్ మాట్లాడుతూ.. ’ బట్టతల ఉన్నవాళ్లకు కరోనా తొందరగా సోకుతుంది. అందుకు కారణం వారి శరీరంలో అండ్రోజెనెటిక్​ అలోపెసియా హార్మోన్​ లోపం ఉండటమే.

ఈ విషయం శాస్త్రీయంగా కూడా నిరూపితం అయ్యింది. కాబట్టి బట్టతల ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. కచ్చితంగా ఫేస్​మాస్క్​ ధరించాలి. ఇంట్లో ఎవరికైనా కరోనా సోకితే వెంటనే ఐసోలేషన్​ కు వెళ్లాలి. లేదంటే ఈ మహమ్మారి అందరికీ పాకే అవకాశం ఉంది. అంతేకాక బట్టతల ఉన్నవారికి కరోనా తొందరగా సోకుతుంది. వారి పరిస్థితి కూడా విషమించే అవకాశం ఉంది కాబట్టి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.