Begin typing your search above and press return to search.

డేంజర్: నిద్రలేమితో క్యాన్సర్

By:  Tupaki Desk   |   6 Oct 2019 11:43 AM IST
డేంజర్: నిద్రలేమితో క్యాన్సర్
X
ఉరుకుల పరుగుల జీవితం.. ఆధునిక ఉద్యోగాలు.. పగలు రాత్రి తేడా లేని పని.. దీంతో ఉదయం బయటకు వెళితే రాత్రి అవుతుందని ఇంటికొచ్చేసరికి.. సెల్ ఫోన్ మాయలో పడి రాత్రి పడుకునే సరికి రెండు, మూడు గంటలు అవుతుంటుంది. మళ్లీ పొద్దునే లేచి అదే ప్రయాణం.. ఇక రాత్రి ఉద్యోగాలు చేసే వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు..

ఆధునిక సమాజంలో నిద్ర అనేది బంగారమైపోయింది. ఇప్పుడు కంటినిండా నిద్రపోయేవాడే అసలైన అదృష్టవంతుడిగా మారిపోయాడు. అయితే నిద్ర లేకపోతే చాలా డేంజర్ అని పరిశోధనలో తేలింది. మనిషి రోజులో కనీసం 6 గంటలు నిద్రపోవాలి. అంతకంటే తగ్గిందా మీకు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడం ఖాయమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

6గంటల కంటే నిద్ర తగ్గితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది. ముఖ్యంగా షుగర్, బీపీ వ్యాధులతో బాధపడేవారికి నిద్రలేమితో క్యాన్సర్ వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక నిద్రలేమీతో 40 ఏళ్లు దాటిన వారికి గుండెజబ్బులు కూడా వస్తాయని పరిశోధనలో తేల్చారు.