Begin typing your search above and press return to search.
భారత్ లో డేంజర్ బెల్స్.. మధుమేహంపై షాకింగ్ సర్వే..!
By: Tupaki Desk | 13 Feb 2023 9:00 PM GMTభారత్ లో రోజురోజుకు మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీయంగా పెరిగి పోతుంది. ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో బాధపడుతున్న వారిలో పోలిస్తే భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచంలోని ప్రతి ఆరుగురిలో ఒకరు మధుమేహ వ్యాధిగ్రస్తులు భారత్ నుంచి ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ క్రమంలోనే తాజాగా ఐసీఎంఆర్.. ఎన్ఐఎన్ సహా 21 సంస్థలు దేశ వ్యాప్తంగా మధుమేహంపై సర్వే నిర్వహించి పలు షాకింగ్ విషయాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా 600 ప్రాంతాల్లోని 18 నుంచి 69 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 10వేల 659 మంది ఆరోగ్య వివరాలను సేకరించి కీలక విషయాలను వెల్లడించాయి.
ఈ అధ్యయనంలో వెల్లడైన విషయాలు పరిశీలిస్తుంటే భారత్ మధుమేహ భారతంగా మారడానికి ఎంతో కాలం పట్టదనిపిస్తోంది. భారత్ లో అధిక బరువు.. ఊబకాయం కారణంగా 73 శాతం మందికి షుగర్ వచ్చే అవకాశం ఉందని సర్వేలో తేలింది. అలాగే 98.4 శాతం మంది సరిపడా కూరగాయలు.. పండ్లు తినడం లేదని వెల్లడైంది. దీంతో వీరి శరీరానికి కావాల్సిన పోషకాలు అందడం లేదని తేల్చారు.
ఇకపోతే 2040 నాటికి దేశంలో ఊబకాయుల సంఖ్య మూడింతలు పెరిగే ప్రమాదం ఉండే అవకాశం ఉందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఊబకాయం కారణంగా ఎక్కువ మందిలో షుగర్ వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంటున్నాయి. అలాగే దీర్ఘకాలిక సమస్యలు.. బీపీ సమస్యతో అనేకమంది బాధపడే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రతి యేటా దేశంలో మధుమేహ బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. భారత్ లో ఇప్పటికే 77 మిలియన్ల జనాభా మధుమేహంతో బాధపడుతున్నారని ఒక అంచనా. అధికారిక లెక్కల ప్రకారం మాత్రమే ఈ సంఖ్య ఇంత ఉంటే అనధికారికంగా మధుమేహంతో ఎంతమంది బాధపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే మధుమేహ వ్యాధిగ్రస్తులలో భారత్ రెండో స్థానంలో ఉంది. 77 మిలియన్ల మంది మధుమేహంతో జీవిస్తుండగా మరో 80 మిలియన్ల మంది ప్రీ-డయాబెటిక్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రీ-డయాబెటిక్స్ చాలా వేగంగా డయాబెటిస్‌గా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇక 2045 నాటికి భారత్ లో 135 మిలియన్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉంటారని సర్వే అంచనా వేసింది. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న మధుమేహం డేంజర్స్ బెల్స్ మోగిస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మధుమేహానికి కారణమవుతున్న అధిక బరువు విషయంలో అంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నిర్లక్ష్యం వహిస్తే జీవితాంతం డయాబెటీస్ కు సంబంధించిన మందులతో గడపాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.