Begin typing your search above and press return to search.
దండుపాళ్యానికి మించిన డేంజర్.. 9 నెలల్లో 6 మర్డర్లు
By: Tupaki Desk | 25 Jun 2021 2:30 PM GMTచూసేందుకు అమాయకంగా.. చదువు లేనోళ్ల మాదిరి కనిపిస్తూ.. టార్గెట్ చేసినోళ్లను దారుణంగా హతమార్చే పరమ దుర్మార్గమైన దొంగల ముఠాగా.. హంతకులుగా దండుపాళ్యం బ్యాచ్ ను చెప్పటం తెలిసిందే. ఇప్పుడు చెప్పే ఉదంతం దీనికి మించింది. ఈ సైలెంట్ కిల్లర్లను మామూలుగా చూస్తే.. పాపం అమాయకులు. సాదాసీదాగా ఉండే వారిని పట్టుకొని హంతకులు అంటారా? మీకెలా మనసు ఒప్పిందంటూ వాదించినా ఆశ్చర్యం లేదు.
ఎందుకంటే.. వీరి హత్యల తీరు అంత ప్లాన్డ్ గా ఉంటుంది. జల్సాల కోసం ముఠాగా ఏర్పడి తొమ్మిది నెలల్లో ఏకంగా ఆరుగురిని చంపటమే కాదు.. రానున్న రోజుల్లో పన్నెండు మందిని హత్య చేసేందుకు పక్కా ప్లాన్ చేసిన వారిని విజయవాడ పోలీసులు అత్యంత చాకచక్యంగా అరెస్టు చేశారు. పోలీసుల అదుపులో ఉన్న వారు.. విచారణలో పేర్కొన్న వివరాల్ని తెలిస్తే వణుకు పుట్టాల్సిందే. గతంలో సంచలనంగా మారిన దండుపాళ్యం సినిమాలోని క్యారెక్టర్లను గుర్తు తెచ్చేలా వీరి తీరు ఉంటుందని చెప్పాలి. ఆ మాటకు వస్తే.. వారి కంటే వీరు మరింత డేంజర్. వారు ఆరాచకంగా హత్య చేస్తారు. వీరు.. హత్య చేస్తే.. చంపేసిన ఆనవాళ్లు మిగల్చకుండా నేచురల్ గా మరణించినట్లుగా సీన్ క్రియేట్ చేస్తారు
విజయవాడలోని పోరంకి.. తాడిగడప.. కామయ్యతోపు ప్రాంతాలకు చెందిన ఐదుగురు (గోపీ, చంటి, ప్రభు, ఫణీంద్ర, చక్రవర్తి) ఆటో డ్రైవర్లుగా.. కూరగాయలు అమ్ముతూ బతుకుతుంటారు. వ్యసనాల బారిన పడిన ఈ ఐదుగురు ఒక జట్టుగా మారారు. ఉదయం పూట తాము పని చేసే క్రమంలో పెద్ద వయస్కులు ఒంటరిగా ఉండే వారిని గుర్తిస్తారు. ఎవరికి అనుమానం రాకుండా ఇంట్లోకి ప్రవేశించి.. ఒంటరిగా ఉండే వారిని ఊపిరి ఆడకుండా చంపేస్తారు. అనంతరం నగలు.. డబ్బుతో ఉడాయిస్తారు.
వారి తొలి హత్య 2020 అక్టోబరులో పోరంకిలో ఉండే 58 ఏళ్ల ఒంటరి మహిళ నళిని హత్య చేశారు. వారు ప్లాన్ చేసినట్లే.. మరణించిన వ్యక్తిది సహజ మరణంగా చుట్టుపక్కల వారు నమ్మటం.. ఎలాంటి అనుమానం లేకుండా అంత్యక్రియలకు హాజరు కావటం.. మరో హత్యకు ప్లాన్ చేయటం చేస్తారు. అలా మొత్తం ఆరుగురిని హత్య చేశారు. ఏ సందర్భంలోనూ మరణించిన వారు హత్యకు గురైనట్లుగా గుర్తించలేదు. ఆ మాటకు వస్తే తాజాగా వారిచ్చిన సమాచారంతో.. మరణించిన వారి కుటుంబాలకు.. వారు సహజంగా మరణించలేదని.. హత్యకు గురైనట్లుగా పోలీసులు చెప్పటంతో వారంతా విస్తుపోతున్నారు.
తాము టార్గెట్ చేసిన వారిని హత్య చేసిన తర్వాత.. ఆ ఇంటి మీద నిఘా పెట్టేవారు. పోలీసులు వచ్చారా? చుట్టుపక్కల వారికి ఏమైనా అనుమానం వచ్చిందా? లాంటివి చెక్ చేసుకుంటూ.. శ్మశానానికి డెడ్ బాడీని పంపే వరకు అక్కడే ఉండటం.. అవసరమైతే అంత్యక్రియల్లో పాలుపంచుకోవటం లాంటివి చేసేవారు. మరింత ప్లాన్డ్ గా హత్యలు చేసే వారు పోలీసులకు ఎలా చిక్కారన్న సందేహం వచ్చిందా? అక్కడికే వస్తున్నాం. ఈ నెల 12న విజయవాడ శివారులోని పోరంకిలో ఒక బ్యాంక్ ఏటీఎం చోరీ యత్నం జరిగింది. సీసీ కెమేరాల్ని పరిశీలించినప్పుడు ముఖానికి ప్లాస్టిక్ కవర్లు వేసుకున్న వ్యక్తులు కనిపించారు.
వీరిని జాగ్రత్తగా గమనించినప్పుడు తాడిగడపకు చెందిన ఆటో డ్రైవర్ చక్రవర్తిని గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని ఏటీఎం చోరీ గురించి విచారణ చేసే క్రమంలో తాము హత్యల గురించి చెప్పటంతో పోలీసులు షాక్ తిన్నారు. అతడిచ్చిన సమాచారాన్ని తీసుకొని.. మిగిలిన వారిని అదుపులోకి తీసుకొని వారి వేలిముద్రల్ని పరీక్షించగా.. నేరం చేసినట్లు గుర్తించారు. మొదట్లోనోరు విప్పని వారు.. తర్వాత వారు చెప్పే విషయాలకు పోలీసులు సైతం విస్మయానికి గురయ్యారు. అంతేకాదు.. త్వరలో మరో 12 మందిని హత్య చేయాలని ప్లాన్ చేసుకున్నట్లుగా తేల్చారు. దండుపాళ్యానికి మించిన దుర్మార్గంతో వ్యవహరించే ఈ ఐదుగురిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది.