Begin typing your search above and press return to search.

డ్యాన్సింగ్ అంకుల్.. ఇప్పుడు ఎన్నికల్లో..

By:  Tupaki Desk   |   31 Oct 2018 11:04 AM GMT
డ్యాన్సింగ్ అంకుల్.. ఇప్పుడు ఎన్నికల్లో..
X
డ్యాన్సింగ్ అంకుల్ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇదివరకు ఒకే ఒక డ్యాన్స్ తో ఈయన దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. భోపాల్ లోని బాబా ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న సంజీవ్ శ్రీవాస్తవ.. తన బావ మరిది పెళ్లిలో చేసిన డ్యాన్స్ ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపును తీసుకొచ్చింది. ఆ డ్యాన్స్ వీడియో వైరల్ కావడంతో ఓవర్ నైట్ ‘డ్యాన్సింగ్ అంకుల్’గా స్టార్ అయిపోయాడు.

తాజాగా ఆయన ఉండే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు వేళయ్యింది. వినూత్న డ్యాన్స్ తో పాపులర్ అయిన సంజీవ్ శ్రీవాస్తవపై ఇప్పుడు ఎన్నికల అధికారుల దృష్టి పడింది. ఓటు హక్కు పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సంజీవ్ ను సంప్రదించారట ఎన్నికల అధికారులు. ఆయన ఒప్పుకోవడంతో ఓ ప్రచార వీడియోను తీసి విడుదల చేశారు. ప్రజలకు ఓటను వినియోగించుకోవాల్సిందిగా ఆ వీడియోలో సంజీవ్ వినూత్నంగా తెలిపారు. దీంతో డ్యాన్సింగ్ అంకుల్ గానే కాదు.. ఇప్పుడు సామాజిక వేత్తగా కూడా సంజీవ్ పాపులర్ అయిపోయాడు. ఈయనతో విదిశా జిల్లా అధికారులు కూడా ఒప్పందం చేసుకొని ఎన్నికలపై అవగాహన కల్పిస్తుండడం విశేషం.