Begin typing your search above and press return to search.

డ్యాన్సింగ్ ఆంటీ వీడియో ....వైర‌ల్!

By:  Tupaki Desk   |   21 Jun 2018 11:29 AM GMT
డ్యాన్సింగ్ ఆంటీ వీడియో ....వైర‌ల్!
X
ఈ ఇంట‌ర్నెట్ జ‌మానాలో సోష‌ల్ మీడియా వాడకం విచ్చ‌ల‌విడిగా పెరిగిపోయిన సంగ‌తి తెలిసిందే. త‌మ టాలెంట్ ను ప్ర‌ద‌ర్శించేందుకు ఫేస్ బుక్ - ట్విట్ట‌ర్ - యూట్యూబ్ - వాట్సాప్ వంటి సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్స్ చాలామందికి ఉప‌యుక్తంగా ఉన్నాయి. గ‌తంలో ఏ మీడియా చానెలో...పేప‌రో క‌వర్ చేస్తేనే వారిలోని ప్ర‌తిభ వెలుగులోకి వ‌చ్చేది. ప్ర‌స్తుతం స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండ‌డంతో ఒక్క వీడియోతో చాలామంది సెల‌బ్రిటీలు అయిపోతున్నారు. మ‌ధ్య ప్ర‌దేశ్ కు చెందిన డ్యాన్సింగ్ అంకుల్ ఒకే ఒక్క వీడియోతో ఓవ‌ర్ నైట్ సెల‌బ్రిటీగా మారిపోయిన సంగ‌తి తెలిసిందే. గోవిందాను మ‌రపించేలా స్టెప్పులేసిన ప్రొఫెస‌ర్ శ్రీ‌వాస్త‌వ‌కు నెటిజ‌న్లు ఫిదా అయిపోయారు. సోష‌ల్ మీడియాలో శ్రీ‌వాస్త‌వకు ఫాలోయింగ్ విప‌రీతంగా పెరిగింది. ఈ డ్యాన్సింగ్ అంకుల్ వీడియోను కొన్ని సంస్థలు త‌మ యాడ్స్ కు కూడా వాడుకుంటున్నాయంటే ఆయ‌న ఎంత పాపుల‌ర్ అయ్యారో చెప్ప‌వ‌చ్చు. తాజాగా, అదే త‌ర‌హాలో `డ్యాన్సింగ్ ఆంటీ` వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

ప్ర‌ముఖ సింగ‌ర్ యోయో హ‌నీ సింగ్ పాట‌లకు యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర‌లేదు. హ‌నీసింగ్ పాట‌ల‌కు కుర్ర‌కారు మాత్ర‌మే స్టెప్పులేస్తార‌నుకుంటే మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్లే. హ‌నీసింగ్ పాట `పార్టీ ఆల్ నైట్` కు ఓ ఆంటీ అదిరిపోయే రీతిలో డ్యాన్స్ చేసింది. సంప్ర‌దాయ దుస్తుల్లో ఉన్న ఆ ఆంటీ వేస్తున్న స్టెప్పులకు వేదిక ద‌గ్గ‌రున్న గ్రామ‌స్థులు క‌ళ్లార్ప‌కుండా చూస్తున్నారు. గుజ‌రాత్ వైర‌ల్ అనే ఫేస్ బుక్ పేజీలో ఆ వీడియో పోస్ట్ అయిన కొద్ది గంట‌ల్లోనే వైర‌ల్ అయింది. డ్యాన్సింగ్ ఆంటీ వీడియో ప్ర‌స్తుతం ట్రెండింగ్ లో ఉంది. డ్యాన్సింగ్ అంకుల్ త‌ర‌హాలోనే డ్యాన్సింగ్ ఆంటీ వీడియో కూడా నెటిజ‌న్ల‌కు తెగ న‌చ్చేసింది. అయితే, ఆ వీడియో బ‌హుశా గుజ‌రాత్ లోని ఓ గ్రామంలో జ‌రిగిన వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల సంద‌ర్భంగా తీసి ఉంటారని నెటిన‌న్లు కామెంట్స్ పెడుతున్నారు. వీడియో పాత‌దైనా తాజాగా సోష‌ల్ మీడియాను ఊపేస్తోంది.