Begin typing your search above and press return to search.

పెళ్లి ఊరేగింపు‌లో కత్తులతో డ్యాన్సులు - తుపాకీ కాల్పులు!

By:  Tupaki Desk   |   19 Dec 2020 8:10 AM GMT
పెళ్లి ఊరేగింపు‌లో కత్తులతో డ్యాన్సులు - తుపాకీ కాల్పులు!
X
పెళ్లి ఊరేగింపు అంటే .. ఆ హంగామా వేరే లెవెల్ లో ఉంటుంది. పెళ్లి ఊరేగింపులో పెళ్లి కి వచ్చిన బంధువులు , స్నేహితులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. కానీ , తాజాగా ఓ పెళ్లి బారాత్ లో అందరిలాగే మాములు డ్యాన్సులతో హుంగామ చేస్తే ఏముంటుంది అనుకున్నారో ఏమో కానీ ఏకంగా కత్తులు, తల్వార్లతో పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ డ్యాన్స్ చేసారు. ఇక పెళ్లి కొడుకు అయితే ఏకంగా గన్ తో కాల్పులు చేస్తూ బారాత్ లో ఫుల్ ఎంజాయ్ చేసారు. అయితే , ఆ తర్వాత పోలీసులు వచ్చి వారిపై కేసు నమోదు చేసారు.

అసలు ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే .. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడా మొహమ్మద్ హిల్స్ లో పెళ్లి బారాత్ తో హల్ చల్ చేశారు. అర్ధరాత్రి ఓ పెళ్లి బారాత్‌ తో రోడ్ పై పెళ్లి కొడుకును ఊరేగిస్తూ.. అతని మిత్రులు చేసిన హడావిడికి అందరూ హడలెత్తిపోయారు. కత్తులు, తల్వార్లు పట్టుకుని ఇష్టమొచ్చినట్లు ఎగిరారు. పెళ్లికొడుకైతే గన్ చేతిలో పట్టుకుని డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వైరల్‌ వీడియో కాస్తా పోలీసుల కంటపడడంతో.. ఈ పెళ్లి ఎవరిది , ఈ హడావిడి ఎక్కడ జరిగిందని ఆరా తీశారు. గన్‌ లు, కత్తులతో హల్‌ చల్‌ చేసిన వ్యక్తులపై ఆరా తీసి, వారిపై కేసు నమోదు చేశారు చాంద్రాయణగుట్ట పోలీసులు. ఈ ఘటనను పోలీసులు సీరియస్‌ తీసుకున్నారు. అసలు ఆ తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది , బారాత్‌ లో దాన్ని ఎందుకు బయటకి తీశారని ఆరా తీస్తున్నారు పోలీసులు.