Begin typing your search above and press return to search.

సీఎం కావడానికి రామన్నకు అన్ని అర్హతలు ఉన్నాయి : ఎమ్మెల్యే నాగం

By:  Tupaki Desk   |   22 Aug 2020 1:00 PM GMT
సీఎం కావడానికి రామన్నకు అన్ని అర్హతలు ఉన్నాయి : ఎమ్మెల్యే నాగం
X
కేసీఆర్ తరువాత కేటీఆర్ సీఎం అయితే త‌ప్పేంటీ… ఈ మ‌ధ్య రోజుల్లో ప్రతి ఒక్క టీఆర్ ఎస్ నేత నోటి నుండి ఈ తరహా ప్రకటనే చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ దృష్టిలో ప‌డాల‌న్న అత్యుత్సాహామో లేక సెల‌క్టెడ్ గా అధిష్టాన‌మే కేటీఆర్ సీఎం అంశాన్ని తెర‌పైకి తెస్తుందో , సరైన సమాచారం లేదు కానీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కేటీఆర్ భజన చేస్తున్నారు. ఈ మధ్య కేటీఆర్ సీఎం హోదాలో క్యాబినెట్ స‌మావేశాన్ని ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ఏర్పాటు చేసారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే తెర వెనుక అంతా కేటీఆర్ క‌నుస‌న్న‌ల్లోనే న‌డుస్తుంద‌న్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే , సోష‌ల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే కేటీఆర్ దీనిపై ఇంత‌వ‌ర‌కు స్పందించ‌లేదు.

ఇప్పటికే మంత్రి కేటీఆర్ కేసీఆర్ తరువాత కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి అని పలువురు ఎమ్మెల్యేలు కామెంట్స్ చేయగా ..తాజాగా వారి జాబితాలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేరారు. కేటీఆర్ సీఎం కావాలి, ఆయ‌న సీఎం కావాలి అని భ‌గ‌వంతున్ని ప్రార్థిస్తున్నా అంటూ ప్ర‌క‌టించారు. వినాయక చవితి సందర్భంగా..ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన దానం నాగేందర్.. కేటీఆర్ సీఎం కావాలని తాను దేవుడిని కోరుకున్నట్లు తెలిపారు. సీఎం కావడానికి అన్ని అర్హతలు రామన్నకు ఉన్నాయన్నారు. ప్రజల మైండ్ సెట్ పసిగట్టి , దానికి తగ్గట్టు వెంటనే తగు నిర్ణ‌యాలు తీసుకునే అల‌వాటున్న సీఎం కేసీఆర్ , కేటీఆర్ కు త్వరలోనే ప‌ట్టాభిషేకం చేసేందుకు రెడీ అవుతున్నారేమో అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. చూడాలి మరి అధిష్టానం , మంత్రి కేటీఆర్ , నాగం కామెంట్స్ పై స్పందిస్తారేమో ..