Begin typing your search above and press return to search.
పార్టీ మార్పుపై స్పందించిన దానం నాగేందర్
By: Tupaki Desk | 2 July 2021 4:14 PM GMTరేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాగానే ఒక వైబ్రేషన్ కాంగ్రెస్ లో వచ్చింది. దాంతోపాటు కాంగ్రెస్ లో ఉత్సాహం వెల్లివిరిసింది. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్న సంతోషం వెల్లివిరిస్తోంది. ఈ క్రమంలోనే భగ్గుమన్న సీనియర్లది ‘టీ కప్పులో తుఫాన్ లా’ మారి చల్లబడింది. రేవంత్ సీనియర్లు అందరినీ కలిసి శాంతింప చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ టార్గెట్ కాంగ్రెస్ మాజీలపై పడింది.
వైఎస్ఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్ ను శాసించిన దానం నాగేందర్ సైతం రేవంత్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ లోకి వస్తున్నారని కొద్దిరోజులుగా సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆయన త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ ప్రచారం సాగుతోంది.
తాను కాంగ్రెస్ లో చేరుతున్నానన్న వార్తలపై దానం నాగేందర్ స్పందించారు. 'రేవంత్ రెడ్డి మాటలకు మూతి, తోక ఏది ఉండదని' విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇక గుంజుకునుడే అంటున్నాడని.. గుంజుకోవడానికి ఎవడబ్బ సొమ్ము కాదని దానం ఎదురుదాడి చేశారు.
నేను కాంగ్రెస్ లో చేరుతున్నానన్న వార్తలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు దానం నాగేందర్ తెలిపారు. క్రిమినల్ కేసులు పెట్టాలని కోరారు. నా ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్ లోనే ఉంటా.. కాంగ్రెస్ లోకి వెళ్లడానికి ఆ పార్టీలో ఏముంది? కాంగ్రెస్ లో ఓ వర్గం నన్ను హ్యుమిలేట్ చేస్తేనే బయటకు వచ్చానని దానం తెలిపారు.
వైఎస్ కంటే కేసీఆర్ ఎక్కువ అభివృద్ధి చేస్తున్నారని.. నేను నమ్ముకున్న నేత ఉన్నంత వరకూ ఆ నేత వెంటే ఉంటానని దానం స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో చీము నెత్తురుంటే బయటకు రావాలని డిమాండ్ చేశారు. దళిత ఎంపవర్ మెంట్ సమావేశానికి మోత్కుపల్లి వచ్చి బీజేపీ పరువు కాపాడారని దానం తెలిపారు.
టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ కింద పనిచేస్తారా? కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాలని దానం అన్నారు. రేవంత్ అదృష్టం బాగుండి వీహెచ్ ఆస్పత్రి పాలయ్యాడని.. లేకుంటే ఇప్పటికే దుమ్ము లేచేదని విమర్శించారు. నా ఇంటికి ఎవరైనా గులాబీ కండు వా వేసుకునే రావాలని దానం స్పష్టం చేశారు.
ఇలా పార్టీ మార్పుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని దానం ఖండించారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని దానం క్లారిటీ ఇచ్చినట్టైంది.