Begin typing your search above and press return to search.

దానం టికెట్ ఖ‌రారైన‌ట్లేన‌ట‌!

By:  Tupaki Desk   |   20 Sep 2018 6:13 AM GMT
దానం టికెట్ ఖ‌రారైన‌ట్లేన‌ట‌!
X
ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి అన్న సామెత అచ్చుగుద్దిన‌ట్లుగా స‌రిపోతుంది టీఆర్ఎస్ నేత దానం నాగేంద‌ర్ వ్య‌వ‌హారాన్ని చూస్తే. సుదీర్ఘ‌కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయ‌న‌.. ఆ పార్టీ పుణ్య‌మా అని మంత్రి ప‌ద‌విని ప‌దేళ్ల పాటు ఎంజాయ్ చేసిన వైనాన్ని మ‌ర్చిపోకూడ‌దు. పార్టీ ఏదైనా హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో పేరున్న లీడ‌ర్లు ఎవ‌ర‌న్న లిస్ట్ చూస్తే.. దానం నాగేంద‌ర్ పేరు త‌ప్ప‌క ఉండే ప‌రిస్థితి. ఇక‌..హైద‌రాబాద్‌ కాంగ్రెస్ లో తోపు లీడ‌ర్ల జాబితాలో ప్ర‌ముఖంగా ఉండే దానం నాగేంద‌ర్ తాజా ప‌రిస్థితి చూసిన‌ప్పుడు అయ్యో పాపం అనేలా ఉండే ప‌రిస్థితి.

కాంగ్రెస్ పార్టీలో కీల‌క నేత‌ల్లో ఒక‌రిగా ఉన్న దానం.. ఎన్నిక‌లు వ‌చ్చాయంటే.. త‌న త‌ర‌ఫున ఇద్ద‌రు ముగ్గురికి టికెట్లు ఇప్పించుకునే ప‌రిస్థితి. అలాంటి స్థాయి ఉన్న నేత‌.. టీఆర్ ఎస్ లోకి వ‌చ్చాక తాను కోరుకున్న సీటును ఓకే చేయించుకోవ‌టానికి ఆయ‌న ప‌డిన పాట్లు అన్ని ఇన్ని కావ‌ని చెబుతారు. తాను బ‌రిలోకి దిగాల‌ని డిసైడ్ అయిన ఖైర‌తాబాద్ అసెంబ్లీ టికెట్ ను ఖ‌రారు చేసేందుకు కేసీఆర్‌.. కేటీఆర్ ల చుట్టూ ఆయ‌న చేసిన ప్ర‌దక్షిణాలు ఓరేంజ్లో ఉండ‌ట‌మే కాదు.. ఎలాంటి నేత ఎలాంటి ప‌రిస్థితిలోకి వెళ్లార‌న్న జాలి ప‌లువురి నోట వినిపించే ప‌రిస్థితి.

ఎన్ని క‌ష్టాలు ప‌డ్డారో.. మ‌రెంత‌గా బ్ర‌తిమిలాడారో కానీ కేసీఆర్ మ‌న‌సును గెలుచుకొని.. ఖైర‌తాబాద్ సీటుకు గులాబీ అభ్యర్థిగా దానం పేరు క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించి దానంకు ప్ర‌త్యేక వ‌ర్త‌మానం అందిన‌ట్లుగా తెలుస్తోంది.

ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసిన వెంట‌నే టీఆర్ఎస్ అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించిన కేసీఆర్ మొత్తం 105 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నా.. అందులో దానం బ‌రిలోకి దిగాల‌ని త‌ల‌చిన ఖైర‌తాబాద్ సీటు లేదు. బీజేపీతో ఉన్న ర‌హ‌స్య ఒప్పందంలో భాగంగానే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న స్థానాల్లో అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించ‌లేద‌న్న వాద‌న వినిపించింది.

బీజేపీ సిట్టింగులు ఉన్న స్థానాల్లో బ‌ల‌హీన‌మైన అభ్య‌ర్థుల్ని బ‌రిలోకి దించ‌టం ద్వారా వారి గెలుపున‌కు ప‌రోక్షంగా కేసీఆర్ స‌హ‌క‌రించ‌నున్నార‌న్న విమ‌ర్శ‌లు వినిపించాయి. తాజాగా అలాంటి విశ్లేష‌ణ‌ల‌కు చెక్ చెబుతూ.. దానం పేరును డిసైడ్ చేయ‌టం ద్వారా.. బీజేపీకి గట్టి పోటీ ఇవ్వ‌టం ఖాయ‌మ‌న్న సంకేతాల్ని కేసీఆర్ పంపార‌న్న మాట వినిపిస్తోంది. మిగిలిన సంగ‌తులు ఎలా ఉన్నా.. త‌న అభ్య‌ర్థిత్వంపై గ‌డిచిన కొన్ని రోజులుగా న‌డిచిన ప్ర‌తిష్ఠంభ‌న తాజా ప‌రిణామంతో తీరిపోతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.