Begin typing your search above and press return to search.

గులాబీ గూటికి మాజీ ఉపముఖ్యమంత్రి

By:  Tupaki Desk   |   7 Dec 2015 7:15 AM GMT
గులాబీ గూటికి మాజీ ఉపముఖ్యమంత్రి
X
కిరణ్ కుమార్ రెడ్డికి డిప్యూటీగా పనిచేసిన దామోదర రాజనర్సింహ కారెక్కుతారని వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ లో క్రియాశీలంగా లేరు. పార్టీ కూడా ఆయన్ను పెద్దగా పట్టించుకోవడం లేదు. తెలంగాణ పీసీసీగా పనిచేసిన పొన్నం కానీ, ప్రస్తుత చీఫ్ ఉత్తమ్ కానీ దామోదరను ఏమాత్రం లెక్కలోకి తీసుకోవడం లేదు. దీంతో ఆయన పార్టీని వీడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా రాజనర్సింహను టీఆర్ ఎస్ లోకి తీసుకురావడానికి మంత్రి హరీశ్ రావు తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. మెదక్ జిల్లాకు చెందిన రాజనర్సింహతో మంత్రి హరీశ్ రావుకు మొదటి నుంచి మంచి సంబంధాలే ఉన్నాయి. టీఆర్ ఎస్ విపక్షంగా ఉన్నప్పుడు సిద్దిపేటకు చెందిన పనులను రాజనర్సింహ ద్వారానే హరీశ్ చక్కబెట్టుకునే వారని… ఆయన నుంచి వచ్చిన ఏ ప్రతిపాదనకైనా అప్పట్లో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఓకే చెప్పేవారని కొందరు నేతలు అంటుంటారు. అదేవిధంగా ఇప్పుడు రాజనర్సింహకు సంబంధించిన పనులను టీఆరెస్ ప్రభుత్వంలో పూర్తిచేయించడంలోనూ హరీశ్ సహకారం ఉంటోంది. ఈ కారణంగానే ఆయనను పార్టీలోకి రప్పించే బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్… హరీశ్ రావుకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తే రాజనర్సింహ గులాబీ కండువా కప్పుకోవడం ఖాయం.