Begin typing your search above and press return to search.

ఖండాతరాలు దాటినా సంకుల సమరమేనా...డల్లాస్ లో ఒకరి అరెస్ట్

By:  Tupaki Desk   |   2 Jan 2023 9:47 AM GMT
ఖండాతరాలు దాటినా సంకుల సమరమేనా...డల్లాస్ లో ఒకరి అరెస్ట్
X
కులం అన్నది ఎందుకో గర్వంగా భావించే కల్చర్ ఆధునిక జీవితంలో సైతం పెరుగుతోంది. భారతీయ జీవిత విధానాల వల్ల కొంత మేర అది ప్రభావం చూపిన విదేశాలకు వెళ్ళి ఖండాంతరాలను చూసినా ఇంకా సంకుచితతత్వం పోకపోవడం మాత్రం చిత్రంగానే కాదు విషాదంగా చూడాలి.

న్యూ ఇయర్ వేడుకలలో డల్లాస్ లో కమ్మ కాపు వివాదం రేగి ఒకరిని అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు అన్న వార్తలు ఇపుడు సంచలనంగా మారాయి. తెలుగు వారు డల్లాస్ లో స్థిరపడి అన్ని విధాలుగా రాణిస్తున్నారు. ఇక వారూ వీరూ తేడా లేకుండా అందరూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. కానీ ఇక్కడ గాలి నీరు కూడా ఒంట్లో ఉన్న కొన్ని రుగ్మతలను తొలగించలేకపోతున్నాయని చెప్పడానికి ఉదాహరణగా ఈ వివాదాన్ని చూస్తున్నారు.

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తెలుగు ఎన్నారై అసోసియేషన్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన వేడుకలలో కమ్మ కాపు అంటూ రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది అంటున్నారు. రిట్జ్-కార్ల్‌టన్ ప్రాంతంలో ఘనంగా నిర్వహించిన మ్యూజికల్ నైట్ లో అక్కడ నివసిస్తోన్న తెలుగు వారంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున ఇందులో పాల్గొన్నారు.

ఇక ఇక్కడా చూస్తే మ్యూజికల్ నైట్ లో పాటల విషయంలో కొంత వివాదం నడచిందిల్ కేవలం నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పాటలను మాత్రమే ఎంపిక చేసి మ్యూజికల్ నైట్ లో పాడాలని నందమూరి అభిమానులు పట్టుబట్టారు. దీనికి పవన్ కల్యాణ్ అభిమానులు ప్రతిఘటించారు. ఇలా మొదలైన వివాదం కాస్తా మద్యం మత్తులో ఉన్న తెలుగుదేశం నాయకుడిగా చెప్పుకునె వ్యక్తి పవన్ కల్యాణ్ అభిమానులపై దాడికి దిగినట్లు చెబుతున్నారు. దీన్ని పవన్ కల్యాణ్ అభిమానులు ప్రతిఘటించడంతో గొడవ చోటు చేసుకుంది.

ఇక వ్యవహారం ఎంతదాకా వెళ్ళిందంటే అన్ స్టాపబుల్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ వచ్చి బాలయ్య పక్కన చేతులు కట్టుకుని నిలబడ్డాడు అంటూ నందమూరి ఫ్యాన్స్ మాటల దాడి చేశరట. ఒకనాడు పవన్ కళ్యాణ్ సభలకు వచ్చే వారిని ఉద్దేశించి బాలయ్య అలగాజనం అని విమర్శించినా చివరికి పవన్ బాలయ్య షోకి వచ్చారని కూడా ఫ్లాష్ బ్యాక్ ని కెలికి మరీ గొడవను పెద్దది చేశారట. ఒక దశలో పవన్ చిరంజీవి పోస్టర్లను సైతం చింపేసి రచ్చ చేయడంతో వ్యవహారం కాస్తా పోలీసుల దాకా వెళ్ళి కేసీ చేకూర్ని అరెస్ట్ చేశారని అంటున్నారు.

ఇక అటూ ఇటూ ఫ్యాన్స్ మధ్య వివాదం పెద్ద ఎత్తున చెలరేగడంతో ఈవెంట్ మేనేజర్లు కార్ల్‌టన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో డల్లాస్ పోలీసులు ఒక వ్యక్తి ని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే తానా రంగంలోకి దిగినట్లు సమాచారం. ప్రస్తుతం రెండు వైపుల ఉన్న ఫ్యాన్స్ ని నచ్చచెప్పి అతనికి బెయిల్ ఇప్పించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే మెగా నందమూరి అభిమానులు అంతా ఒక్కటిగా ఉంటున్నారు. రాం చరణ్, జూనియర్ ఎన్టీయార్ అయితే ట్రిపుల్ ఆర్ మూవీలో నటించి తమ సఖ్యతను చాటుకున్నారు. బాలయ్య పవన్ కళ్యాణ్ ఒక షోకి వచ్చారు అంటే ఇద్దరూ మంచి స్నేహ బంధాన్ని చాటుకున్నారు అని అర్ధం. ఇలా హీరోలు ఉంటే అభిమానుల పేరిట విడిపోయి పరాయి దేశంలో రచ్చ చేసుకోవడం, కులాల కంపుతో కెలుక్కోవడం అవసరమా అన్న చర్చ అయితే వస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.