Begin typing your search above and press return to search.

వాట్సాప్ స్టేటస్‌ లో ఫొటోలు పెట్టాడని దళిత యువకుడి హత్య!

By:  Tupaki Desk   |   18 Jan 2021 5:30 PM GMT
వాట్సాప్ స్టేటస్‌ లో ఫొటోలు పెట్టాడని దళిత యువకుడి హత్య!
X
వాట్సప్ స్టేటస్ ఓ హత్యకు దారి తీసిన దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఫొటోల వ్యవహారం ఓ దళిత యువకుడి హత్యకి దారితీసింది. వాట్సాప్‌ స్టేటస్‌లో ఫొటోలు పెట్టాడన్న కోపంతో ఈ దారుణానికి పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. ఈ సంఘటన కర్ణాటకలోని యశవంతపురలో ఆదివారం కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ఆంధ్రహళ్లికి చెందిన అభి ప్రవీణ, మనోజ్‌ అనే యువకుల ఫొటోలను అదే ప్రాంతానికి చెందిన శీను అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. దీంతో ఆ ఇద్దరు యువకులు శీనా ఇంటికి వెళ్లి చాకుతో పొడిచి ఉడాయించారు. తీవ్ర గాయాలతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా హతుడు దళిత సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. రాజగోపాల్ ‌నగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.