Begin typing your search above and press return to search.

ఏపీ మండ‌లి చైర్మ‌న్‌గా ద‌ళిత నేత‌?.. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం!

By:  Tupaki Desk   |   26 Aug 2021 8:31 AM GMT
ఏపీ మండ‌లి చైర్మ‌న్‌గా ద‌ళిత నేత‌?.. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం!
X
ఏపీ శాస‌న మండ‌లి చైర్మ‌న్‌గా ద‌ళిత నేత ఎంపిక కానున్నారా? ద‌ళితుల‌కు ఇటీవ‌ల కాలంలో ముఖ్య‌మం త్రి జ‌గ‌న్ ప్రాధాన్యం ఇస్తున్న నేప‌థ్యంలో కీల‌క‌మైన మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌విని కూడా వారికే కేటాయిం చాలనే ఆలోచ‌న‌తో ఉన్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెం దిన కోయె మోషేన్ రాజును మండ‌లి చైర్మ‌న్‌గా నియ‌మించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన మోషేన్ రాజు.. గ‌త ఏడాది గ‌వ‌ర్న‌ర్ కోటాలో మండ‌లిలో కాలు పెట్టారు

ఇక‌, ద‌ళితులు చాలా మంది ఉన్న‌ప్ప‌టికీ.. మోషేన్ రాజుకుఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారంటే.. రెండు కార‌ణాలు ఉన్నాయి. ఒక‌టి ద‌ళిత కార్డు. రెండు వైఎస్ కుటుంబానికి ఈయ‌న అత్యంత విశ్వాస‌పాత్రుడు. కాంగ్రెస్‌లో రాజ‌కీయాలు ప్రారంభించిన మోషేన్‌.. దివంగ‌త వైఎస్ అనుచ‌రుడిగా పేరుతెచ్చుకున్నారు. ఎలాంటి అప్పాయింట్‌మెంట్ లేకుండానే వైఎస్ క‌లిసిన నాయ‌కుల్లో.. మోషేన్ ఉన్నారు.దీంతో ఆ త‌ర్వాత కాలంలో .. వైసీపీకి కూడా చేరువ‌య్యారు. కేవ‌లం రాజ‌కీయాల‌తోనే స‌రిపుచ్చ‌కుండా.. వైసీపీ అధినేత క‌ష్టాల్లో ఉన్న కాలంలోనూ మోషేన, ప్ర‌స్తుత మంత్రి సుచ‌రిత వంటివారు.. ఆ కుటుంబానికి అండ‌గా నిలిచారు.

ఈ క్ర‌మంలోనే వైసీపీలోనూ మోషేన్‌కు ప్రాధాన్యం ల‌భించింది. ఇక‌, ప్ర‌స్తుతం అసెంబ్లీ స్పీక‌ర్‌గా బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన త‌మ్మినేనికి ఛాన్స్ ఇచ్చిన జ‌గ‌న్‌.. మండ‌లికి ఇప్పుడు మోషేన్ రాజును చైర్మ‌న్ చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే మండ‌లిలో ఖాళీ అయిన చైర్మ‌న్‌, డిప్యూటీ చైర్మ‌న్ ప‌ద‌వుల‌కు సంబంధించి జ‌గ‌న్ తుది నిర్ణ‌యం తీసుకున్నార‌ని.. చైర్మ‌న్‌గా మోషేన్‌, డిప్యూటీగా బీసీ వ‌ర్గానికి చెందిన జంగా కృష్ణ‌మూర్తిని నియ‌మించ‌నున్నార‌ని.. అంటున్నారు. జంగా గుంటూరుకు చెందిన కీల‌క నాయకుడు.

బీసీ సామాజిక వ‌ర్గాన్ని గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ వైపు మ‌ళ్లించిన దిట్ట‌గా జంగాకు మంచి పేరుంది . బీసీ-స‌బ్ ప్లాన్ అమ‌లులోనూ జంగా ముఖ్య భూమిక పోషించారు. దీంతో బీసీ వ‌ర్గాల్లో జంగాకు మంచి ప‌ట్టు.. ఉండ‌డం గ‌మ‌నార్హం. త్వ‌ర‌లోనే.. జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ వ‌ర్షాకాల సమావేశాల్లో.. చైర్మ‌న్ నియామ‌కా నికి సంబంధించిన నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న స‌మాచారం ప్ర‌కారం.. వ‌ర్షాకాల స‌మావేశాలు.. సెప్టెంబ‌రు తొలి వారంలో జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ స‌మావేశాల్లో.. ఆర్థిక ప‌రిస్థితిపై ఒక కీల‌క ప్ర‌క‌ట‌న కూడా చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

ఇటీవ‌ల‌కాలంలో రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఈ విష‌యంపై ఇప్ప‌టికే ఆర్థిక మంత్రి.. బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌.. పలుమార్లు వివ‌ర‌ణ ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ.. విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న నేప‌థ్యంలో అసెంబ్లీ వేదిక‌గా.. దీనిపై వివ‌ర‌ణ ఇచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. అదేస‌మ‌యంలో ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు.. మ‌రిన్ని సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌వెశ పెట్టే ఆలోచ‌న కూడా చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయా ప‌థ‌కాల‌కు సంబంధించి కూడా ఒక స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.