Begin typing your search above and press return to search.

కుల జాడ్జ్యం మరీ ఈ రేంజ్ లో ఉందా?

By:  Tupaki Desk   |   8 Oct 2016 4:30 AM GMT
కుల జాడ్జ్యం మరీ ఈ రేంజ్ లో ఉందా?
X
దేశాభివృద్ధికి ఆటంకంగా ఉన్నది ఏమిటి? భారతదేశం ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండటానికి గల కారణాలేమిటి? అత్యధిక జనాభా.. నిరక్షరాస్యత.. సివిక్ సెన్స్ తక్కువగా ఉండటం.. నల్ల ధనం.. కులం.. ఇవన్నీ ప్రధాన కారణమే అయినా, చదువుకున్న కొందరిలో దాగున్న మూర్ఖత్వం, కుల జాడ్జ్యం కూడా ప్రధాన కారణాలు అని చెప్పుకోవాలి!! పదిమందికి విద్యాబుద్దులు నేర్పించాల్సిన వ్యక్తి, రేపటి పౌరులను తీర్చి దిద్దాల్సిన ఉపాధ్యాయుడు మనిషిగా ఆలోచించడం మనేశాడు.. తాను మనిషి అన్న విషయం మరిచాడు.. కాగితాల్లో తప్ప మరెక్కడా కనిపించని, కనిపించరాని కులాన్ని ఆసరాగా, సాకుగా తీసుకుని తోటి వ్యక్తిని చంపేశాడు.

అత్యంత నీచమైనదిగా, అత్యంత హేయమైనదిగా, ఒక మనిషి చేయకూడని పనిదిగా అనిపిస్తున్న ఈ దారుణం ఉత్తరాఖండ్ బాగేశ్వర్ జిల్లా కదారియా లో జరిగింది. తమ అగ్రకులస్తుల పిండి మరను ఉపయోగించి మలినం చేశాడంటూ ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి తల నరికి చంపాడో ఉపాధ్యాయుడు! ఈ విషయాలు వెల్లడించిన పోలీసులు... "సోహాన్ రామ్ (31) కుందన్‌ కు చెందిన మరలో గోధుమలు ఆడించి పిండిని తీసుకెళ్తుండగా చూసిన పాఠశాల ఉపాధ్యాయుడు లలిత్ కర్ణాటక్... సోహాన్ కులాన్ని దూషించి, అతడి వల్ల మర మలినమైందని అవమానించి, ఎందుకు దూషిస్తున్నావని ప్రశ్నించినందుకు కొడవలితో నరికి హత్య చేశాడు" అని చెప్పారు!

ఈ విషయంపై సోహాన్‌ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కాగా, ఈ పిండి మరను దళితులు - అగ్రకులస్తులు కూడా వాడేవారని గ్రామస్తులు చెబుతున్నారట. అయితే... దసరా నేపథ్యంలో తాము అమ్మ వారికి నైవేద్యం పెట్టేందుకు పిండిని ఆడించిన తర్వాతే దళితులు ఈ మరను వినియోగించుకోవాలని అగ్రకులస్తులు ఆదేశించారని చెబుతున్నారు. దసరా కి తాము పూజిస్తున్న అమ్మవారు కోరుకున్నది ఇదా, చెప్పింది ఇదా, నేర్పుతుంది ఇదా.. ఏమిటి అమ్మా దేశానికి ఈ దరిద్రం!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/