Begin typing your search above and press return to search.

అవును.. టీఆర్ఎస్ వాళ్ల‌కే ద‌ళిత బంధు

By:  Tupaki Desk   |   5 March 2022 12:30 AM GMT
అవును.. టీఆర్ఎస్ వాళ్ల‌కే ద‌ళిత బంధు
X
పేద‌రికంలో ఉన్న ద‌ళితుల‌ను ఆదుకునేందుకు.. వాళ్ల‌కు ఉపాధి మార్గాలు చూపించేందుకు.. అర్హులైన ద‌ళిత కుటుంబాల‌కు రూ.10 ల‌క్ష‌లు.. ఇదీ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన ద‌ళిత బంధు ప‌థ‌కం ముఖ్య ఉద్దేశం. కానీ ఇప్పుడా ప‌థ‌కం ల‌క్ష్యం దారి త‌ప్పుతుంద‌ని త‌మ అనుచ‌రుల‌కే ద‌ళిత బంధు అందేలా ఎమ్మెల్యేలు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఆ విమ‌ర్శ‌ల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూర్చేవిగా ఉన్నాయి.

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఈట‌ల రాజేంద‌ర్‌పై గెలుపే ల‌క్ష్యంగా కేసీఆర్ ద‌ళిత బంధు ప‌థకాన్ని ప్రారంభించార‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. ఆ ఎన్నిక‌ల్లో ఓట‌మితో కేసీఆర్‌కు షాక్ త‌గిలింది. మ‌రోవైపు ద‌ళిత బంధు విష‌యంపై ప్ర‌తిప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఆ ప‌థ‌కాన్ని అంచెలంచెలుగా రాష్ట్రమంతా విస్త‌రింప జేయాల‌ని కేసీఆర్ అనుకున్నారు. ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేసే బాధ్య‌త ఎమ్మెల్యేల‌కు అప్ప‌గించారు. కానీ ఆ ఎమ్మెల్యేలు పేద‌రికంలో ఉన్న అర్హుల‌ను ప‌క్క‌న‌పెట్టి కేవ‌లం త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను మాత్ర‌మే ఎంపిక చేస్తున్నారని ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి.

తాజాగా న‌ర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న‌రెడ్డి కూడా అదే వ్యాఖ్య‌లు చేశారు. ద‌ళిత బంధులో టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌కే ప్రాధాన్య‌మిస్తామ‌ని ఆయ‌నే నేరుగా పేర్కొన్నారు. ఆ త‌ర్వాతే మిగ‌తా వాళ్ల‌కు అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పారు.

ద‌ళిత బంధు ప‌థ‌కానికి ల‌బ్ధిదారుల ఎంపిక‌పై ప్ర‌తిప‌క్షాలు ఎన్ని ఆరోప‌ణ‌లు చేసినా తొలుతు టీఆర్ఎస్ వాళ్ల‌కే ఇస్తామ‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కోసం ప‌ని చేస్తున్న వాళ్ల‌కే ప్ర‌భుత్వ ప‌థ‌కాలు మొద‌ట అందేలా చూస్తామ‌న్నారు.

దీంతో ప్ర‌తిప‌క్షాలతో పాటు వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌లు అధికార ఎమ్మెల్యేపై మండిప‌డుతున్నారు. పేద‌రికంలో మ‌గ్గిపోతున్న ప్ర‌జ‌ల‌ను కాద‌ని కేవ‌లం పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కే లబ్ధి చేకూరుస్తామ‌ని ఓ ఎమ్మెల్యే చెప్ప‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌భుత్వం ఉన్న‌ది ప్ర‌జ‌ల కోస‌మా? లేదా పార్టీ కార్య‌క‌ర్త‌ల కోస‌మా? అని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.