Begin typing your search above and press return to search.
అవును.. ఆ దున్న రేటు అక్షరాల రూ.4కోట్లు
By: Tupaki Desk | 19 July 2016 4:40 AM GMTఖరీదైన వాచ్ ని.. ఖరీదైన స్కాచ్ గురించి విని ఉంటాం. కానీ.. ఖరీదైన దున్న గురించి వినటం కొత్త వ్యవహారమే. ఒక దున్నపోతు ధర ఏకంగా రూ.4కోట్లు అంటే అవాక్కు అవ్వాల్సిందే. కోట్లు పలుకుతున్న ఈ దున్న గొప్పతనం ఏమిటి? ఎందుకంత ధర పలుకుతుంది? ఇంతకీ ఆ దున్నపోతు ఎక్కడ ఉంది? లాంటి వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాకు చెందిన మున్నాసింగ్ కొన్నేళ్ల క్రితం మిగిలిన దున్నపోతుల మాదిరే ఒక దున్నపోతును కొనుగోలు చేశారు. దానికి హీరా అని పేరు పెట్టుకొని అపురూపంగా పెంచాడు. బ్రీడింగ్ కోసం ఈ దున్న దగ్గరకు గేదెలను తీసుకురావటం మామూలే. అలానే హీరాను బ్రీడింగ్ కోసం వినియోగించాడు. అయితే.. హీరా కారణంగా పుట్టిన దూడలు ఆరోగ్యకరంగా ఉండటమే కాదు.. భారీగా పాలిచ్చే గేదెలుగా తయారు కావటం హాట్ టాపిక్ గా మారింది.
దీంతో.. హీరా గొప్పతనం గురించి చుట్టుపక్కల ఊళ్లకు పాకిపోయింది. దీంతో.. తమ గేదెల్ని హీరాతో బ్రీడింగ్ చేయించాలంటూ మున్నా సింగ్ ఇంటి వద్ద క్యూ కట్టటం పెరిగింది. డిమాండ్ కు తగ్గట్లే హీరాతో బ్రీడింగ్ చేసేందుకు లక్షలాది రూపాయిలు ఇవ్వటానికి ముందుకు రావటంతో దీని విలువ పెరిగిపోయింది. ఇదిలా ఉంటే.. హీరాను తనకు ఇచ్చిన పక్షంలో రూ.4 కోట్లు ఇస్తానని ఒక వ్యాపారి చెప్పినట్లుగా మున్నాసింగ్ చెబుతున్నాడు. హీరాను చూసేందుకే చుట్టుపక్కల గ్రామాల నుంచి పలువురు తన ఇంటికి వస్తున్నట్లు గర్వంగా చెబుతాడు.
హీరాను అపురూపంగా పెంచటంతో పాటు.. దాన్ని ఆరోగ్యంగా ఉంచటం కోసం చాలానే ప్రయత్నాలు చేస్తుంటాడు.రోజుకు మూడు.. నాలుగు కిలోమీటర్ల వాకింగ్ కు తీసుకెళ్లటం నుంచి నాణ్యమైన ఆహారం దానికి అందిస్తున్నాడు. ఇందుకోసం నెలకు రూ.25 నుంచి రూ.30 వేలు ఖర్చు చేయటం గమనార్హం. బ్రీడింగ్ కోసం లక్షలు ఇచ్చే ఆసాములు ఉన్నప్పుడు ఆ మాత్రం ఖరీదైన ఫుడ్ ఇవ్వకపోతే ఎట్లా..?