Begin typing your search above and press return to search.

ప్ర‌ముఖ మీడియా గ్రూప్ అధినేత ఆక‌స్మిక మృతి

By:  Tupaki Desk   |   13 April 2017 4:28 AM GMT
ప్ర‌ముఖ మీడియా గ్రూప్ అధినేత ఆక‌స్మిక మృతి
X
ప్ర‌ముఖ మీడియా గ్రూప్ అధినేత ఆక‌స్మికంగా మృతి చెందారు. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక స‌ర్క్యులేష‌న్ క‌లిగిన నాలుగో దిన‌ప‌త్రిగా పేరున్న దైనిక్ భాస్క‌ర్ గ్రూపు ఛైర్మ‌న్ ర‌మేశ్ చంద్ర అగ‌ర్వాల్ (73) బుధ‌వారం గుండెపోటుతో మ‌ర‌ణించారు. 1944లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఝూన్సీలో జ‌న్మించిన ఆయ‌న 1956లో భోపాల్ వ‌చ్చారు. రెండేళ్ల‌లోనే (1958)లోనే తండ్రితో క‌లిసి దైనిక్ భాస్క‌ర్ ప‌త్రిక‌ను ఆయ‌న ప్రారంభించారు.

అలా మొద‌లైన దైనిక్ భాస్క‌ర్ స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనేఅత్య‌ధిక స‌ర్య్కులేష‌న్ క‌లిగిన దిన‌ప‌త్రిక‌గా పేరొందింది. ప్ర‌స్తుతం 14 రాష్ట్రాల్లో 62 ఎడిష‌న్లు ప్ర‌చురించే స్థాయికి వచ్చింది. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక స‌ర్య్కులేష‌న్ క‌లిగిన నాలుగో దిన‌ప‌త్రిక‌గా దైనిక్ భాస్క‌ర్‌కు పేరుంది. విల‌క్ష‌ణ‌మైన ప్రింటింగ్ తో పాటు.. వార్త‌ల విష‌యంలోనూ ఎప్ప‌టిక‌ప్పుడు అత్యాధునిక ప‌ద్ద‌తుల్ని అనుస‌రించ‌టం దైనిక్ భాస్క‌ర్ గ్రూప్ ప్ర‌త్యేక‌త‌గా చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈరోజు (గురువారం) ఆయ‌న అంత్య‌క్రియ‌లు భోపాల్‌లో జ‌ర‌గ‌నున్నాయి. దిన‌ప‌త్రిక‌ను ప్రారంభించిన నాలుగున్న‌ర ద‌శాబ్దాల వ్య‌వ‌ధిలోనే ప్ర‌పంచంలోని అత్య‌ధిక స‌ర్య్కులేష‌న్ క‌లిగిన దిన‌ప‌త్రిక‌గా పేరు ప్ర‌ఖ్యాతుల్ని సాధించ‌టం దైనిక్ భాస్క‌ర్ సొంత‌మ‌ని.. అదంతా ర‌మేశ్ చంద్ర అగ‌ర్వాల్ గొప్ప‌త‌నంగా ప‌లువురు అభివ‌ర్ణిస్తున్నారు.

ఆయ‌న మృతికి ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. సంతాపం వ్య‌క్తం చేసిన వారిలో ప్ర‌ధాని మోడీ.. బీజేపీ జాతీయ అధ్య‌క్షులు అమిత్ షా.. రాజ‌స్థాన్ సీఎం వ‌సుంధ‌ర రాజే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో స‌హా ప‌లువురు ఆయ‌న కుటుంబానికి సంతాపాన్ని తెలియ‌జేశారు. ర‌మేశ్ చంద్ర అగ‌ర్వాల్ మృతి భార‌త ప‌త్రికా రంగానికి తీర‌ని లోటుగా అభివ‌ర్ణించారు. సాదాసీదా తెలుగు ప్ర‌జ‌ల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేని ఈ భార‌త మీడియా జెయింట్ నిష్క్ర‌మ‌ణ మీడియా రంగానికి షాకింగ్ న్యూస్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/