గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారనే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
మేష రాశి: వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి నిరాశజనం. బంధువుల నుంచి ఆర్థిక విషయాల్లో ఒత్తిడులు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు పనిభారం. రాజకీయ - కళాకారులకు పరీక్షా సమయం. ఐటీ నిపుణులు శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు నిరాశ. రియల్ ఎస్టేట్ వారు పట్టుదలతో ముందుకు సాగుతారు. మహిళలకు శ్రమాధిక్యం. లక్ష్మీ స్తోత్రాలు పఠించండి.
వృషభరాశి: ఆర్థిక పరిస్థతి మెరుగ్గా ఉంటుంది. మీ అంచనాలు నిజమవుతాయి. గృహయోగం - రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయ - కళాకారులకు శుభ సమాచారం అందుతుంది. ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి. ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం. ఖర్చులు అధికం. విద్యార్థులకు నూతనోత్సాహం. మహిళలకు కుటుంబ సమస్యలు తీరుతాయి. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
మిథున రాశి: ఆదాయానికి మించి ఖర్చులు. వ్యవహారాలు నిదానం సాగుతాయి. బంధువులతో విరోధాలు. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్లకు చికాకులు. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడులు. వ్యాపారులకు నిరుత్సాహం. ఐటీ నిపుణులకు ఒత్తిడులు. విద్యార్థులకు నిరాశ. పారిశ్రామిక కళారంగాల వారు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుంటారు. మహిళలకు ఉత్సాహం తగ్గుతుంది. ఆంజనేయ దండకం పఠించండి.
కర్కాటక రాశి: సంఘంలో గౌరవం. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదాలు తీరుతాయి. భూ, గృహయోగ సూచనలు. ఉద్యోగులకు ఒత్తిడులు ఉన్నా పట్టుదలతో అధిగమిస్తారు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు అనుకోని అవకాశాలు. వ్యాపారాలలో ముందుడుగు వేస్తారు. విద్యార్థులకు ఒత్తిడులు దూరమవుతాయి. మహిళలకు ఆరోగ్య సమస్యలు తీరుతాయి. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
సింహ రాశి: సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాబడి ఆశించిన విధంగా ఉంటుంది. వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగులకు ఉత్సాహం. ఐటీ నిపుణులు కార్య సాధన దిశగా సాగుతారు. రాజకీయ, పారిశ్రామిక రంగాలవారికి పురస్కరాలు. విద్యార్థులకు నూతన ఆశలు. మహిళలు సంతోషంగా గడుపుతారు. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. శ్రీ మహావిష్ణు ధ్యానం చేయండి.
కన్యారాశి: బంధువులతో వివాదాలు సర్దుబాటవుతాయి. శత్రువులు సమస్యలు సృష్టించినా చాకచాక్యంగా పరిష్కరించుకుంటారు. ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారు చేపట్టిన పనులు విఫలమవుతాయి. వ్యాపాలలో ఆటుపోట్లు. ఉద్యోగులకు బదిలీలు. పనులు ముందుకు సాగవు. ఐటీ నిపుణుల అంచానాలు తప్పుతాయి. రాజకీయ, కళారంగాల వారికి శ్రమ తప్పదు. విద్యార్థులు నిదానం పాటించాలి. మహిళకు మానసిక అశాంతి. శ్రీ నరసింహ ధ్యానం చేయండి.
తులారాశి: పనులు నత్తనడకన సాగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు బదిలీలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఐటీ నిపుణులు మరిన్ని విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు అవకాశాలు ఊరిస్తాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. రియల్ ఎస్టేట్ వారు సమస్యలు అధిగమిస్తారు. మహిళలకు కుటుంబంలో చికాకులు. శివుడిని పూజించండి.
వృశ్చిక రాశి: సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కుటుంబంలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. రియల్ ఎస్టేట్ వారికి నూతనోత్సాహం. ఉద్యోగులకు పదోన్నతులు. ఐటీ నిపుణుల ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలలో లాభాలు. కళాకారులు - రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. భూవివాదాలు కొంతమేరకు పరిష్కారం. విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు. మహిళలకు ఆరోగ్య సమస్యలు తీరుతాయి. శ్రీ వేంకటేశ్వరస్వామిని స్తుతించండి.
ధనస్సు రాశి: ఆర్థిక పరిస్థతి మెరుగ్గా ఉంటుంది. రుణాలు తీరుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పనుల్లో అనుకూలత. విందు వినోదాలు. ఉద్యోగులకు పదోన్నతి. వ్యాపారాలలో పురోగతి. ఐటీ నిపుణులు విజయాలు సాధిస్తారు. పారిశ్రామిక, కళాకారులు ఉత్సాహంగా గడుపుతారు. మహిళలకు మానసిక ప్రశాంతత. శ్రీ వినాయక స్తోత్రాలు పఠించండి.
మకర రాశి: ఉద్యోగులకు అనుకోని మార్పులు. ఎంత కష్టించినా ఫలితం ఉండదు. దీర్ఘకాలిక రుణబాధలు చికాకు కలిగిస్తాయి. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్లకు చికాకులు. వ్యాపారాలలో కొంతమేర లాభాలు. రాజకీయ, కళారంగాలవారు నిదానం పాటించాలి. ఐటీ నిపుణుల యత్నాలు ఫలించవు. హనుమాన్ చాలీసా పఠించండి.
కుంభరాశి: బంధువర్గంతో విభేదాలు. పనులు జాప్యమైన పట్టుదలతో పూర్తి చేస్తారు. శ్రమ పెరిగినా ఫలితం పొందుతారు. రాబడి నిరుత్సాపరుస్తుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మానసిక అశాంతి. పారిశ్రామిక - రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు సమస్యలు. మహిళలకు అశాంతి. శివాష్టకం పఠించండి.
మీనరాశి: అవసరాలకు అప్పులు చేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి పనుల్లో పురోగతి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ - కళారంగాల వారికి పురస్కారాలు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు. ఐటీ నిపుణులు ఆశలు చిగురిస్తాయి. మీ ఊహలు నిజం చేసుకుంటారు. కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మహిళలకు ఆస్తిలాభాలు. అన్నపూర్ణాష్టకం పఠించండి.