Begin typing your search above and press return to search.

సెప్టెంబర్ 27 గురువారం 2018 దినఫలాలు

By:  Tupaki Desk   |   27 Sep 2018 1:32 AM GMT
సెప్టెంబర్ 27 గురువారం 2018 దినఫలాలు
X
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..

మేషరాశి: నూతన భాగస్వామ్యాలు లాభిస్తాయి. జనసంబంధాలు విస్తరిస్తాయి. సమావేశాలు - వేడుకల్లో కీలకపాత్ర పోషిస్తారు. కుటుంబసభ్యుల వైఖరితో ఉల్లాసం. సమావేశాలు - వేడుకల్లో కీలక పాత్ర పోషిస్తారు. కందులు - ఎండుమిర్చి - స్టాకిస్టులు - వ్యాపారులకు సంతృప్తి. స్త్రీలకు నూతన పరిచయాలతో ఇబ్బంది. ఉపాధ్యాయులకు ఒక సమాచారం అందుతుంది. రవాణా రంగాల వారికి సంతృప్తిగా ఉంటుంది.

వృషభరాశి: ఆడిటింగ్ - ఉన్నత - విద్య - విదేశీ వ్యవహారాలకు అనుకూలం. సినీ రాజకీయ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. విందు - వినోదాలు - పర్యటనలు ఊరటనిస్తాయి.వ్యాపారుల బిజినెస్ లో ఆకట్టుకుంటారు. మోసపోయే ఆస్కారం కలదు. ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూళ్లవుతాయి. శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఒక స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి.

మిథునరాశి: ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. సమావేశాలు - వేడుకల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. కొత్త స్నేహాలు - అనుబంధాలు వికసిస్తాయి. వ్యాపారులు బిజినెస్ లో ఆకట్టుకుంటారు. పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో జాగ్రత్త. సంతానం మొండి వైఖరి వల్ల ఎంతో చికాకు. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ఒత్తిడి - చికాకులు ఎదుర్కొంటారు.

కర్కాటకరాశి: వృత్తి - వ్యాపారాల్లో మార్పులు - చేర్పులు అనుకూలిస్తాయి. తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు. ప్రముఖులను కలుసుకుంటారు. రాజకీయ - ప్రభుత్వ రంగాలకు చెందిన వారు గౌరవ మన్ననలు అందుకుంటారు. ఈరోజు పత్రిక - ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బేకరి - పండ్లు - స్వీట్ వ్యాపారాలు జోరుగా సాగుతాయి. కొంతమంది మీ పలుకుబడితో లబ్ధి పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి.

సింహరాశి: పోలీస్ - న్యాయ - బోధన - రవాణా రంగాల వారి సంకల్పం నెరవేరుతుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. మెయిల్స్ - ఫోన్ సందేశాలు ఉల్లాసం కలిగిస్తాయి. బంధువుల అండ లభిస్తుంది. రాజకీయాల్లో వారికి ప్రత్యర్థులు పెరుగుతారు. ప్రేమికులకు వ్యతిరేకత. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. రుణం తీర్చు ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్యరాశి: ఆర్థిక పరిస్థితి మెరగవుతుంది. చిట్ ఫండ్ లు - వడ్డీల డబ్బు చేతికి అందుతుంది. విలువైన వస్తువులు కొంటారు. ఆత్మావలోకనం చేసుకుంటారు. పెట్టుబడుల్ని సమీక్షించుకుంటారు. పన్నుల వ్యవహారాలు పూర్తి చేస్తారు. స్టేషనరీ - ప్రింటింగ్ రంగాల వారికి పని ఒత్తిడి మినహా ఫలితం ఉండదు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ముక్కుసూటి తనంగా పోయే వారికి గొడవలవుతాయి.

తుల రాశి: నూతన భాగస్వామ్యాలకు అనుకూలం సమయం. అనుబంధాలు పెంపొందించుకోవడంపై దృష్టి పెడతారు. వేడుకలు - సమావేశాలు - బృంద కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. కుటుంబ సభ్యుల వైఖరితో ఉల్లాసం కలుగుతుంది. వస్త్ర - బంగారం - వెండి - లోహ పనివాళ్లకు శుభదాయకం. ప్రయాణాల్లో చికాకులు. పరిచయాలతో ఉన్నతి. హామీలు - చెక్కుల జారీల్లో ఏకాగ్రత అవసరం.

వృశ్చికరాశి: సహోద్యోగులతో అంతరంగిక చర్చల్లో పాల్గొంటారు.ఆరోగ్యం నియమాలు పాటిస్తారు. విందు - వినోదాల్లో ఉల్లాసంగా గడుపుతారు. వ్యవసాయం - పరిశ్రమలు హోటల్ - వైద్య రంగాల వారు గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత తప్పదు. స్త్రీలు వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

ధనురాశి: బహుమతులు లభిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. పొదుపు పథకాలపై ఆరాతీస్తారు.ప్రతిభకు గుర్తింపు. కుటుంబంతో ఉల్లాసంగా గడుపుతారు. నష్టాలను పూడ్చుకుంటారు. విదేశీయాన ప్రయత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. కీలక విషయాల్లో పట్టు సాధిస్తారు. స్థిరాస్తి క్రయవిక్రయాల్లో పునరాలోచన అవసరం.

మకరరాశి: గౌరవ పదవులు అందుకుంటారు. పెద్దలతో కుటుంబ విషయాల్లో చర్చలు సాగుతాయి. తల్లిదండ్రులతో శుభపరిణామాలు సంభవం. ఇల్లు - స్థలం మార్పునకు అనుకూలం. వ్యాపారంలో మార్పు గురించి ఆలోచిస్తారు. డబ్బుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త. మాటలు పడతారు. తప్పులు పునరావృతం కానీయద్దు. తేలికగా మోసపోయే అవకాశం. ఉపాధ్యాయులకు - రిప్రెజెంటీటివ్ లకు ఒత్తిడి - చికాకులు.

కుంభరాశి: మెయిల్స్ - ఫోన్ సందేశాలు ఆనందం కలిగిస్తాయి. మార్కెటింగ్ - ప్రకటనలు - ఆడిటింగ్ రంగాల వారికి శుభప్రదం. వాహన కొనుగోలుకు అనుకూలం. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలకు అదనపు సంపాదన. నిరుద్యోగులు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

మీనరాశి: గత అనుభవంతో ఆర్థిక విషయాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. పన్నులు - చిట్ ఫండ్ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సకాలంలో నిధులు సర్దుబాటవుతాయి. ఇతరులకు వాహనాలిస్తే ఇబ్బందులు. సామూహిక సేవ కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. పాత మిత్రుల కలయికతో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి.