Begin typing your search above and press return to search.

సెప్టెంబర్ 22 శనివారం 2018 దినఫలాలు

By:  Tupaki Desk   |   22 Sep 2018 1:43 AM GMT
సెప్టెంబర్ 22 శనివారం 2018 దినఫలాలు
X
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..

మేషరాశి: బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. అంచనాలు అందుకుంటారు. స్నేహబంధాలు బలపడతాయి. పెట్టుబడులు లాభం తెస్తాయి. కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువులు కొంటారు. మీ పలుకుబడితో కొందరు లబ్ధిపొందుతారు. కందులు - ఎండుమిర్చి - స్టాకిస్టులు - వ్యాపారులకు సంతృప్తి కలుగుతుంది. రవాణా రంగాల్లో వారికి సంతృప్తిగా ఉంటుంది.స్త్రీలకు నూతన పరిచయాలతో ఇబ్బంది. ఉపాధ్యాయులకు ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది.

వృషభరాశి: పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్త. వైద్యం - హోటల్ - పరిశ్రమలు - వ్యవసాయ రంగాల వారికి ప్రోత్సాహకరం. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ఇంటర్వ్యూల్లో విజయం. పై అధికారుల సహకారం లభిస్తుంది. వ్యాపార వర్గాల మాటతీరు - స్కీములు కొనుగోలు దారులకు ఆకట్టుకుంటాయి. మోసపోయే అవకాశం ఉంది. ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూళ్లలో శ్రమాధిక్యత - ప్రయాసలు తప్పవు. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. నిరుద్యోగలకు ఉద్యోగ ప్రాప్తి.

మిథునరాశి: సన్నిహితుల నుంచి సమచారం అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులకు ప్రోత్సాహకరం. పొదుపు పథకాలు - పెట్టుబడులకు ప్రణాళికలు రూపొందిస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. పెద్ద మొత్తంలో ధన సహాయం చేయవద్దు. సంతానంతో చికాకులు. ఉద్యోగులుకు ఒత్తిడి - చికాకులు.

కర్కాటకరాశి: ఆర్థిక విషయాల్లో మీ వైఖరి సమీక్షించుకుంటారు. గృహనిర్మాణం - రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలం. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పత్రిక - ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బేకరి - పండ్ల - స్వీట్ వ్యాపారాలు జోరుగా సాగుతాయి. కొంతమంది మీ పలుకుబడి ద్వారా లబ్ధి పొందుతారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి. విశ్రాంతి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.

సింహరాశి: ప్రత్యర్థులపై విజయం. కొత్త స్నేహాలు - పరిచయాలు కలుగుతాయి. కాంట్రాక్టులు - అగ్రిమెంట్లు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల విషయాల్లో శుభ పరిణామాలు సంభవం. రాజకీయాల్లోని వారికి వారి ప్రత్యర్థులు పెరుగుతారు. ప్రేమికులకు ఆంక్షలు తప్పవు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. రుణ తీర్చే ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్యరాశి: ఆర్థిక విషయాల్లో సహోద్యోగుల సహకారం అందుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆస్పత్రులు - హోటల్ - ఔషధ రంగాల వారు లాభాలు ఆర్జిస్తారు. పరిశ్రమలు - వ్యవసాయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్టేషనరీ - ప్రింటింగ్ రంగాల వారికి పని ఒత్తిడి ఎక్కువై ఫలితాలు రావు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. బంధువులతో సంబంధాలు పెంచుకుంటారు. స్త్రీలకు స్వీయ సంపాదనపై ఆసక్తి కలుగుతుంది. అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ముక్కుసూటి తనం గొడవలకు దారితీస్తోంది.

తులరాశి: కొత్త స్నేహాలు చిగురిస్తాయి. చిన్నారుల విద్యా విషయాలపై దృష్టి పెడతారు. పెట్టుబడులపై దృష్టిసారిస్తారు. సాంకేతిక కోర్సుల్లో చేరే వారికి అనుకూల సమయం. బంగారం - వెండి - లోహ పని వాళ్లకు శుభదాయకం. ప్రయాణాల్లో చికాకులు - అసౌకర్యం. పరిచయాలు ఉన్నతిని పెంచుతాయి. ఫీడర్లకు - ఫీడర్ గుమస్తాలకు చికాకులు. హామీలు - చెక్కుల జారీలో జాగ్రత్త.

వృశ్చికరాశి: బంధుమిత్రులతో ఇల్లు సందడిగా ఉంటుంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది. నిత్యావసరాలు - నిర్మాణం - రియల్ ఎస్టేట్ రంగాల వారికి ప్రోత్సాహకరం. కుటుంబ వ్యవహారాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు సంతృప్తినిస్తాయి. ఉద్యోగులకు అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత. వైద్యపరీక్షలు చేయించుకోండి.

ధనురాశి: పెట్టుబడులకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. సంకల్పం నెరవేరుతుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యాసంస్థలతో పనులు పూర్తవుతాయి. విదేశీయాన ప్రయత్నాల్లో స్వల్ప ఆటంకాలు. ఒక నష్టాన్ని మరో విధంగా పూడ్చుకుంటారు.వృత్తి - ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కీలకమైన విషయాల్లో పట్టు సాధిస్తారు. స్తిరాస్తి క్రయవిక్రయాల్లో పునరాలోచన అవసరం.

మకరరాశి: శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. వృత్తి - ఉద్యోగాల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. అదనపు సౌకర్యాలు అందుకుంటారు. ఇంక్రిమెంట్లు - ప్రమోషన్లకు అవకాశం ఉంది. డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్త. మాటలు పడుతారు. తప్పులు పునరావృతం చేయొద్దు. స్కీములతో జాగ్రత్త. తేలికగా మోసపోతారు. ఉపాధ్యాయులకు - రిప్రెజెంటీవీలకు ఒత్తిడి - చికాకులు తప్పవు.

కుంభరాశి: విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్యా విషయాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. సంకల్పం నెరవేరుతుంది. సమావేశాలు - బృంద కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు.లక్ష్య సాధనకు కొత్త పథకాలు రూపొందిస్తారు. పుణ్యాకార్యాలు చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల సమాచారం అందుతుంది. వాహనాలతో జాగ్రత్త.

మీనరాశి: ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరం. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఉన్నతవిద్య, విదేశీ వ్యవహారాల కోసం అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. ప్రముఖుల పరిచయాలు అనుకూలిస్తాయి. వాహనం ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. సామూహిక సేవా కార్యక్రమాలతో పేరొస్తుంది.