Begin typing your search above and press return to search.

సెప్టెంబర్ 21 శుక్రవారం 2018 దినఫలాలు

By:  Tupaki Desk   |   21 Sep 2018 1:44 AM GMT
సెప్టెంబర్ 21 శుక్రవారం 2018 దినఫలాలు
X
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..

మేషరాశి: ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం అందుకుంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. అంచనాలకు దూరంగా ఉంటారు. సమావేశాల్లో అసౌకర్యానికి గురవుతారు. స్త్రీలకు నూతన పరిచయాలతో ఇబ్బంది కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు ఒక సమాచారం ఆసక్తి రేపుతుంది. రవాణా రంగాలవారికి సంతృప్తిగా ఉంటుంది.

వృషభరాశి: గౌరవ మర్యాదలు అందుకుంటారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల కోసం ప్రయత్నిస్తారు. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వృత్తి - వ్యాపారాల్లో లక్ష్యసాధనకు అధికంగా శ్రమించాలి. వ్యాపారులకు కలిసి వస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూళ్లవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి.

మిథునరాశి: విద్యార్థుల అంచనాలు తలకిందులవుతాయి. విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందుతారు. కొత్త ఆలోచనలకు కార్యరూపం దక్కుతుంది. వ్యాపారులకు కలిసి వస్తుంది. ధనసహాయం పెద్దమొత్తంలో చేయవద్దు. సంతానంతో చికాకులు. ఉద్యోగులకు ఒత్తిడి - చికాకులు ఎదురవుతాయి.

కర్కాటక రాశి: ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల వైఖరితో మనస్తాపం. పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. బీమా - పింఛన్ - పన్నులు - మెడికల్ క్లెయిముల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. పత్రికా - ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బేకరి - పండ్లు - స్వీట్ వ్యాపారాలు జోరుగా సాగుతాయి. ఉద్యోగులకు విశ్రాంతి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.

సింహరాశి: పెట్టుబడులు - కోర్టు వ్యవహరాలకు సంబంధించిన కీలక పత్రాలు అందుకుంటారు. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. వాగ్వాదాలకు దూరంగా ఉండండి. సమావేశాలు - చర్చల్లో కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు ప్రత్యర్థులు పెరుగుతారు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత..రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు. రుణాలు తీరుతాయి.

కన్యరాశి: విందు - వినోదాల్లో పాల్గొంటారు. అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తారు. వైద్యం - పరిశ్రమలు - హోటల్ రంగాల వారికి ఆర్థికంగా నిరుత్సాహకంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో సహోద్యోగులు మొహమాట పెట్టే అవకాశం ఉంది. స్టేషనరీ - ప్రింటింగ్ రంగాల వారికి పని ఒత్తిడి మినహా ఫలితం ఉండదు. వాహనాలతో జాగ్రత్త. ముక్కుసూటి ధోరణి పనికిరాదు.

తుల రాశి: కొత్త ఆలోచనలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తారు. విద్యార్థులకు శుభప్రదం. ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడం వల్ల నిరుత్సాహానికి గురవుతారు. కుటుంబ సభ్యుల వైఖరితో మనస్తాపం. వస్త్ర - బంగారం - వెండి - లోహ పనివారాలకు శుభదాయకం. ప్రయాణాల్లో ఊహించని చికాకులు - అసౌకర్యానికి గురికాక తప్పదు.

వృశ్చికరాశి: వేడుకల్లో పాల్గొంటారు. వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ - నిర్మాణ రంగాల వారు కీలక సమాచారం అందుకుంటారు. కుటుంబ వ్యవహారాలు ఆవేదన కలిగిస్తాయి. దూరంలో ఉన్న కుటుంబ సభ్యులు ఇల్లు చేరుతారు. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత తప్పదు.

ధనురాశి: కాంట్రాక్టులు - అగ్రిమెంట్లకు అనుకూలం. సమావేశాలకు ఏర్పాట్లు చేస్తారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల వైఖరి మనస్థాపం కలిగిస్తుంది. విద్యాసంస్థలకు సంబంధించిన పనుల్లో ఆటంకాలు. విదేశీయాన ప్రయత్నాలు ఆటంకం కలిగిస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. స్థిరాస్తి క్రయవిక్రయాల్లో పునరాలోచన అవసరం.

మకరరాశి: పెట్టుబడులకు సంబంధించిన పెద్దల సహకారం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం కోసం ప్రయత్నిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశజనకంగా ఉంటుంది. అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తారు. డబ్బుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త. ఉపాధ్యాయులకు చికాకులు తప్పవు.

కుంభరాశి: కొత్త ఆలోచనలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తారు. రక్షణ - న్యాయ - బోధన - ఆడిటింగ్ రంగాల వారు తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. అంచనాలు అందుకోలేకపోవడంతో నిరాశ. బంధువుల రాకతో పనులు వాయిదా వేసుకుంటారు. స్త్రీలకు అదనపు సంపాదన పట్ల ఆసక్తి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల సమాచారం అందుతుంది. వాహనాలతో జాగ్రత్త.

మీనరాశి: రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంస్మరణల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. సినీ - రాజకీయ రంగాల వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆర్థిక విషయాల్లో సమీక్షించుకుంటారు. ఇతరులకు వాహనం ఇస్తే ఇబ్బందులు కలుగుతాయి.