Begin typing your search above and press return to search.

సెప్టెంబర్ 10 సోమవారం 2018 దినఫలాలు

By:  Tupaki Desk   |   10 Sep 2018 1:36 AM GMT
సెప్టెంబర్ 10 సోమవారం 2018 దినఫలాలు
X
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..

మేషరాశి: వ్యవసాయం - ఆస్పత్రులు - పరిశ్రమలు - హోటల్ - కేటరింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. విందు - వినోదాల్లో పాల్గొంటారు. రావాలసిన డబ్బులు చేతికి అందుతాయి. కుటుంబ సభ్యుల కోరిక తీరుస్తారు. వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలం.

వృషభరాశి: పొదుపు పథకాల గురించి ఆరాతీస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. ప్రియమైన వారు - చిన్నారుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. షాపింగ్ కు అనుకూలం. వేడుకల్లో పాల్గొంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. మత్స్య, కోళ్ల వ్యాపారుస్థులకు లాభదాయకం. స్త్రీలు విలువైన వస్తువులు అమర్చుకుంటారు.

మిథునరాశి: మాతృ వర్గీయులకు సంబంధించిన వ్యవహారాలపై దృష్టి పెడతారు. రియల్ ఎస్టేట్ - నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరం. బదిలీలు - మార్పుల గురించి ఆలోచిస్తారు. ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త. వ్యాపారినికి సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు.

కర్కాటక రాశి: వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలతో ఉల్లాసం. చర్చలు - సమావేశాల్లో లక్ష్యాలు సాధిస్తారు. సన్నిహితుల నుంచి ముఖ్యమైన మెయిల్స్ - ఫోన్లు సందేశాలు అందుకుంటారు. భోజనం సకాలంలో తింటే మేలు. స్త్రీలు విశ్రాంతి ప్రయత్నాలు ఫలించవు. బంధువుల ఆకస్మిక రాకతో గృహంలో ఖర్చులు పెరుగుతాయి.

సింహరాశి: షాపింగ్ లో ఖర్చులు అధికం. విలువైన వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు సౌకర్యాలు సమకూర్చుకుంటారు. ఉల్లి - బెల్లం - పసుపు - కంది - మిర్చి వ్యాపారస్థులకు కలిసివస్తుంది. ఏ వ్యక్తితో అతి చనువు అంతమంచిది కాదు.

కన్యారాశి: వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన ఆలోచనలు కొలిక్కి వస్తాయి. ఆలోచనలను సమీక్షించుకుంటారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సంకల్పం నెరవేరుతుంది. స్తబ్ధత తొలిగిపోయి ఉత్సాహం నెలకొంటుంది. కొబ్బరి - పండ్లు - పూల వ్యాపారులకు లాభదాయకం. వాహనం నడిపినప్పుడు జాగ్రత్తలు అవసరం.

తులారాశి: న్యాయ - భోధన రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. వినోదం - ఫొటో గ్రఫీ - రచనా రంగాల వారికి అనుకూలం. సినీ - రాజకీయ - న్యాయ బోధన రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలు టీవీ చానెల్స్ కార్యక్రమాల్లో రాణిస్తారు. ఉమ్మడి - సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.

వృశ్చికరాశి: ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. సమావేశాల్లో బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. సహకార సంఘాలు - యూనియన్ కార్యకలాపాలకు అనుకూలం. మానసిక శారీరక ఒత్తిడిలు ఉంటాయి. విదేశీ వస్తువులు సేకరిస్తారు. తొందరపాటు వల్ల కుటుంబీకులు - ఎదుటివారితో మాటపడాల్సి వస్తుంది.

ధనురాశి: పెద్దలు - ప్రముఖులను కలుసుకుంటారు. గౌరవ - మన్ననలు అందుకుంటారు. పెద్దల సహకారంతో వృత్తిపరమైన లక్ష్యాలు సాధిస్తారు. పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. వ్యాపారాల్లో మంచి అనుకూలతలు కనబడుతున్నాయి. కుటుంబంలో అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. ప్రేమికుల ఆలోచనలు పెడదోవ పట్టే ఆస్కారం ఉంది.

మకరరాశి: చర్చలు - ప్రయాణాలు ఫలిస్తాయి. భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుంటారు. న్యాయ - బోధన - రక్షణ - రవాణా రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. మంచి కాంట్రాక్టులు లభిస్తాయి. ఆటంకాలు ఎదురైనా నెమ్మదిగా సమసిపోగలవు. సంతానానికి వివాహ విషయాల పట్ల శద్ధ వహిస్తారు. కిరాణ - ఫ్యాన్సీ రంగాల వారికి అనుకూలంగా ఉంది.

కుంభరాశి: వాయిదా పద్ధతులపై వస్తువులు కొనుగోలు చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చకుంటారు. ఆరోగ్య పట్ల జాగ్రత్త అవసరం. ఆర్థిక విషయాల్లో ఉత్సాహంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందులు - వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.

మీనరాశి: బృంద కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. భార్యభర్తల వ్యవహారాలు కలిసివస్తాయి. పందేలు - పోటీల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీవారు - శ్రీమతి వ్యవహారాలు ఉల్లాసం కలిగిస్తాయి.