Begin typing your search above and press return to search.
దాడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే..!
By: Tupaki Desk | 3 July 2015 8:02 AM GMTనిర్ణయాలు తీసుకునే విషయంలో ఏ మాత్రం పొరపాటు దొర్లినా పరిస్థితి దారుణంగా ఉంటుంది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి.. తన మాతృపార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్న దాడి వీరభద్రరావు.. తన బెట్టును పక్కన పెట్టాల్సి వచ్చింది.
తనకున్న పరిమితుల నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవిని కంటిన్యూ చేయలేకపోవటం.. దీనికి సంబంధించి ఆగ్రహంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన దాడి వీరభద్రరావుకు.. తత్వం కాస్త ఆలస్యంగా బోధ పడింది. జగన్‌తో పోలిస్తే.. బాబు కోటిరెట్లు బెటర్ అన్న విషయంతో పాటు.. సుదీర్ఘవిరామం తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీలో సమయానికి తాను లేనన్న విషయం అర్థమై తెగ ఫీలైపోయిన పరిస్థితి.
అప్పటి నుంచి పార్టీలోకి వచ్చేందుకు తెగ ప్రయత్నం చేసినప్పటికి చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో.. గత ఏడాదిగా ఆయన లోగుట్టు ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు సీనియర్ల చేత తాను పార్టీలో చేరే విషయమై బాబుతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికి బాబు అందుకు సుముఖంగా లేకపోవటంతో నిరాశ చెందిన దాడి.. తన రూట్ తాజాగా మార్చినట్లు కనిపిస్తోంది.
ఒకప్పుడు పార్టీ నుంచి వెళ్లద్దని దాడిని పలు విధాలుగా ఆపే ప్రయత్నం చంద్రబాబు చేయటం.. దానికి దాడి ససేమిరా అనటం తెలిసిందే. తాజాగా అందుకు రివర్స్ సీన్ నడుస్తోంది.
కొద్దికాలంగా లోగుట్టు ప్రయత్నాలతో పాటు.. తాజాగా తాను పార్టీలోకి మళ్లీ రావాలని ఆశిస్తున్న విషయాన్ని ఓపెన్‌గా వెల్లడించిన దాడి.. చంద్రబాబు కానీ పిలిస్తే తాను పార్టీలోకి వస్తానని వ్యాఖ్యానించారు. 30 ఏళ్లు పార్టీకి తాను చేసిన సేవ గురించి చెప్పుకున్న దాడి.. తాను చేసిన తప్పుపై మాత్రం లెంపలేసుకోలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి బాబు పిలుపు కోసం ఎదురుచూస్తున్న దాడి వీరభద్రరావుకు కోరిక నెరవేరుతుందో? లేదో చూడాలి.