Begin typing your search above and press return to search.
ఆస్ట్రేలియా ఆటగాళ్లకు దాదానే సరైన మొగుడు..!
By: Tupaki Desk | 14 Jan 2021 4:30 PM GMTభారత్ - పాకిస్థాన్ క్రికెట్ అంటే ఇరుదేశాల అభిమానుల్లో తీవ్రమైన ఉత్కంఠ ఉద్వేగం ఉంటాయి. ఆ తర్వాత క్రికెట్ అభిమానులు ఎక్కువగా వేచి చూసేది.. ఇండియా- ఆస్ట్రేలియా మ్యాచ్‌నే. అయితే ఆస్ట్రేలియాతో క్రికెట్ మ్యాచ్ అంటే మొదట గుర్తొచ్చేది బూతుల పురాణం. ఆట మొదలుపెట్టగానే ప్రత్యర్థులపై మాటల తూటాలు విసరడం.. తిట్ల దండకం అందుకోవడం ఆస్ట్రేలియా క్రికెటర్లకు మొదటి నుంచి ఉన్న అలవాటు.
ఆటగాళ్లను తమ ప్రతిభతో కాకుండా మాటలతో ఓడించడం వాళ్ల నైజం. ప్రముఖ క్రికెటర్లు.. సచిన్, గవాస్కర్ , కపిల్‌దేవ్ దగ్గరనుంచి అందరూ ఆస్ట్రేలియా ఆటగాళ్లతో మాటలు పడ్డవాళ్లే.. అయితే అప్పుడప్పుడూ.. మనవాళ్లు కూడా దీటుగా సమాధానం చెబుతుంటారు. అయితే ఆస్ట్రేలియా క్రికెటర్లకు దీటుగా బదిలిచ్చింది మాత్రం ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు, టీం ఇండియా మాజీ కెప్టెన్ దాదానే.
ఈ విషయాన్ని స్వయంగా ఆసిస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ చెప్పారు. ఆస్ట్రేలియా క్రికెటర్లపై ఇటీవల మళ్లీ స్లెడ్జింగ్ ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఈ విషయంపై హాగ్ మాట్లాడాడు.
‘గతంలో ఏ దేశం ఆసీస్ టూర్‌కు వచ్చినా.. ఆసీస్ ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేసేవారు. అయితే భారత్ నుంచి వచ్చిన ఆటగాళ్లు చాలా సార్లు ఆసీస్ స్లెడ్జింగ్‌కు బలయ్యారు. కానీ వాళ్ల ప్రశ్నలకు దీటైన సమాధానం ఇచ్చింది మాత్రం దాదానే.
ఆసీస్ ఆటగాళ్లపై గంగూలీ దీటుగా ఎదురుదాడికి దిగేవాడు. ఓసారి టాస్ వేస్తున్నప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ వా కొంచెం ఆలస్యంగా వచ్చాడు. వెంటనే గంగూలీ వెంటనే నోటికి పని కల్పించాడు. స్టీవ్ వా పై కామెంట్లు చేశాడు’ అని హాగ్ గుర్తు చేసుకున్నాడు. అయితే గంగూలి వల్లే ఆసీస్ క్రికెటర్లకు.. భారత క్రికెటర్లకు ఇంకా వైరం కొనసాగుతుందని కూడా హాగ్ అన్నాడు.