Begin typing your search above and press return to search.

ఐదేళ్ల కూతురుపై అత్యాచారం..స్నేహితుడిని నరికి చంపిన తండ్రి

By:  Tupaki Desk   |   17 Oct 2019 7:00 AM IST
ఐదేళ్ల కూతురుపై అత్యాచారం..స్నేహితుడిని నరికి చంపిన తండ్రి
X
మైనర్లపై అకృత్యాలు ఆగడం లేదు. ఈ కిరాతక - కీచక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ సమాజంలో. ఇలాంటి నేపథ్యంలో తమిళనాట ఒక విస్మయకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. పొల్లాచ్చి ప్రాంతంలో ఒక ఐదేళ్ల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. ఆ పాప తండ్రి స్నేహితులే ఈ దారుణానికి ఒడిగట్టారు.

మిఠాయి కొనడానికి అంటూ బయటకు వెళ్లిన ఆ పాప ఎంతకూ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆమె కోసం వెదక సాగారు. దాదాపు రెండు గంటల సేపు తర్వాత ఆ పాప వారికి కనిపించింది. తీవ్రమైన రక్తస్రావంతో ఆ చిన్నారి కనిపించడంతో.. తన తండ్రి ఆవేశాన్ని అణుచుకోలేకపోయారు. ఘాతుకం చేసింది ఎవరో తెలుసుకుని.. వారిద్దరినీ వెంటాడు.

వారిలో ఒకడు దొరికాడు. కత్తితో వాడిని తెగనరికాడు ఆ తండ్రి. మరొకడు పారిపోయాడు. ఐదేళ్ల పసిపాపపై అలాంటి ఘాతుకానికి పాల్పడిన వాడికి ఆ తండ్రి సరైన శిక్షనే విధించాడని సభ్యసమాజం భావించాలి. ఇలాంటి ఘాతుకాలు ఎక్కడో ఒక చోట ఆగాలంటే.. ఇలాంటి తక్షణ తీర్పులు అవసరం. చిన్నారులపై లైంగిక దాడుల తీవ్రతను అర్థం చేసుకుని చట్టం కూడా అలాంటి తండ్రిని వదిలివేయాలి. అది ఆత్మరక్షణార్థం తీసుకున్న చర్యగా భావించాలని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.