Begin typing your search above and press return to search.

డీఎస్ కుమారుడి అరెస్ట్‌..త‌ర్వాత ఏంటి?

By:  Tupaki Desk   |   12 Aug 2018 1:31 PM GMT
డీఎస్ కుమారుడి అరెస్ట్‌..త‌ర్వాత ఏంటి?
X
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ నేత - రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కుమారుడు నిజామాబాద్ నగర మాజీ మేయర్ సంజయ్‌ ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని 11మంది నర్సింగ్ విద్యార్థినులు ఇటీవలే హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. హోంమంత్రి సూచన మేరకు నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయశర్మను కలిసి విద్యార్థినులు ఫిర్యాదుచేశారు. ఈ ఫిర్యాదు నేప‌థ్యంలో సంజయ్ గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న విషయం తెలిసిందే. ఈనెల 12వ తేదీలోపు హాజరుకాని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. సంజయ్ ఇంటికి పోలీసులు నోటీసులను అతికించారు.

ఇలా డీఎస్ త‌న‌యుడి కేంద్రంగా సాగుతున్న ప‌రిణామాలు అన్ని వ‌ర్గాల‌లో ఆస‌క్తిని రేకెత్తించిన నేప‌థ్యంలో ఆదివారం కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. నిజామాబాద్ ఏసీపీ కార్యాలయంలో డీఎస్ త‌న‌యుడు విచారణకు హాజరయ్యారు. లాయర్‌ తో కలిసి వచ్చిన సంజయ్‌ను ప్రాథమిక విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సంజయ్‌కు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. సంజయ్‌ను మొదటి అదనపు జిల్లా జడ్జి మేరీ సారమ్మ ఎదుట పోలీసులు హాజరుపరిచారు. ఏసీపీ సుదర్శన్ దర్యాప్తు చేపట్టి రిమాండ్‌ కు త‌ర‌లించారు.

తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని 11మంది నర్సింగ్ విద్యార్థినులు ఇటీవలే హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. హోంమంత్రి సూచన మేరకు నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయశర్మను కలిసి విద్యార్థినులు ఫిర్యాదుచేశారు. బాధిత విద్యార్థినుల వెంట వారి తల్లిదండ్రులతో పాటు పీడీఎస్‌ యూ - పీవోడబ్ల్యూ - ఐఎఫ్‌ టీయూ - పీవైఎల్ - ఏఐకేఎంఎస్ సంఘాలకు చెందిన నాయకులు ఉన్నారు. తమకు ప్రాణభయమున్నదని - లైంగిక వేధింపులకు పాల్పడిన సంజయ్‌ ను శిక్షించాలని ఈ సందర్భంగా విద్యార్థినులు సీపీని కోరారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు సంజయ్‌ పై నిర్భయ చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. అనంతరం పోలీసులు సంజయ్‌ను అరెస్టు చేసేందుకు వెళ్లగా అప్పటికే పరారీలో ఉన్నట్టు తెలుసుకున్నారు. ఆ తర్వాత తన నివాసంలో ప్రెస్‌ మీట్ పెట్టి తనకు ఏ పాపం తెలియదని చెప్పిన సంజయ్ అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తాజాగా అరెస్ట్ అయ్యారు. ఈ నేప‌థ్యంలో కోర్టు ద్వారా బెయిల్ పొంద‌డం ఒక్క‌టే సంజ‌య్‌కు ఉన్న మార్గ‌మ‌ని తెలుస్తోంది.