Begin typing your search above and press return to search.
కర్ణాటక.. ఇంతకూ కాంగ్రెస్ సీఎం ఎవరు?
By: Tupaki Desk | 13 May 2023 1:10 PM GMTకర్ణాటక లో ఎవరి సహాయం అవసరం లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తేలిపోయింది. ఆ పార్టీ 122 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇందులో ఇప్పటికే 34 చోట్ల విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిగ్ ఫిగర్ 113 సీట్లను దాటి కాంగ్రెస్ 9 సీట్లు అధికంగా ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎంగా పగ్గాలు చేపట్టే వ్యక్తి ఎవరనేదాని పై చర్చోపచర్చలు సాగుతున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేస్తుందని పీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం పదవికి గట్టి పోటీదారుగా ఉన్న ఆయన కనకపుర నుంచి రికార్డు స్థాయిలో విజయం సాధించారు.
అలాగే వరుణ స్థానంలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విజయం దిశగా సాగుతున్నారు. గతంలో ఐదేళ్లపాటు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోమారు తన తండ్రే ముఖ్యమంత్రి అవుతారని సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్లలో దాదాపు 90 శాతం సిద్ధరామయ్య, శివకుమార్ సూచించిన వారికే దక్కాయి. మిగతా 10 శాతం కాంగ్రెస్ అధిష్టానం కేటాయించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సిద్ధరామయ్య, శివకుమార్ సీఎం బాధ్యతలు చేపట్టడానికి ముందు వరుసలో ఉన్నారు.
మరోవైపు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేది కూడా కర్ణాటకే కావడం గమనార్హం. కేంద్ర మంత్రిగా, లోక్ సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్ పార్టీ పక్ష నేతగా పనిచేసిన మల్లిఖార్జున ఖర్గేకు ఇంతవరకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. ఆయన 11సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో మల్లిఖార్జున ఖర్గేకు సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అందులోనూ ఆయన దళిత నేత. మల్లిఖార్జున ఖర్గేకు ఇవ్వకపోతే ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రియాంక్ ఈ ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేశారు.
సిద్ధరామయ్య, శివకుమార్, మల్లికార్జున ఖర్గేలు మాత్రమే కాకుండా రాహుల్ గాంధీకి సన్నిహితుడైన కేంద్ర మాజీ మంత్రి మునియప్ప, మాజీ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర కూడా సీఎం పదవిని ఆశిస్తున్నారు. మునియప్ప, పరమేశ్వర ఇద్దరూ దళిత నేతలే కావడం గమనార్హం.
అలాగే కాంగ్రెస్ పార్టీలో సౌమ్యులుగా, నిజాయతీపరులుగా పేరున్న రామలింగారెడ్డి, ఆర్‌వీ దేశపాండే పేర్లు కూడా సీఎం పదవికి వినిపిస్తున్నాయి.
రాహుల్ గాంధీకి సన్నిహితుడైన కృష్న బైరే గౌడ, దినేష్ గుండురావుల పేర్లు కూడా తెరమీదకొస్తున్నాయి. ఇక మహిళల్లో ఫైర్ బ్రాండుగా పేరున్న లక్ష్మీ హెబ్బాళ్కర్ పేరు కూడా వినిపిస్తోంది.
ఇలా పదుల సంఖ్యలోనే కర్ణాటక సీఎం పదవికి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులు పోటీ పడుతున్నా సిద్ధరామయ్య లేదా శివకుమార్ ల్లో ఒకరు కాంగ్రెస్ సీఎం పదవిని చేపట్టే వీలుందని చర్చ జరుగుతోంది.
కాగా ఎన్నికల పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాత శాసనసభలో ఎమ్మెల్యేల ఓటింగ్ ఆధారంగా ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం మంచిదన్న నిర్ణయానికి పార్టీ హైకమాండ్ వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయాలని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోరుతున్నారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఇష్టపడే వారినే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేయాలనేది ఆయన డిమాండ్ గా ఉందని అంటున్నారు.
కాగా సీఎం పదవి కోసం గట్టి పోటీదారులుగా నిలిచిన మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తమ సొంత నెట్ వర్క్ ల ద్వారా ఎమ్మెల్యేల మనసు చూరగొనడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల మద్దతు కీలకంగా మారిన నేపథ్యంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తమ పేరునే అధిష్టానానికి సూచించేలా వీరు పావులు కదుపుతున్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక సహా కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను సులభతరం చేసేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు రణదీప్ సింగ్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్ లను హైకమాండ్ ప్రతినిధులుగా బెంగళూరుకు పంపింది. మరోవైపు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బెంగళూరులోనే ఉన్నారు. ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ, ప్రభుత్వ ఏర్పాటులో ఆయన కూడా చక్రం తిప్పనున్నారు.