Begin typing your search above and press return to search.

ఫొనిపై భారత్ ను కొనియాడిన యూఎన్

By:  Tupaki Desk   |   5 May 2019 11:53 AM GMT
ఫొనిపై భారత్ ను కొనియాడిన యూఎన్
X
ఐక్యరాజ్యసమితి విపత్తు నిర్వహణ సంస్థ (ఓడీఆర్ఆర్) భారత వాతావరణ శాఖ పనితీరును వేయినోళ్ల ప్రశంసించింది. ఫొనీ తుఫాన్ తీవ్రతను ముందుగా గుర్తించి వేల మందిని కాపాడిందని కొనియాడింది. ఫొని తుఫాన్ గమనం.. విషయంలో చాలా ఖచ్చతత్వంతో వ్యవహరించి.. ముందస్తుగా తీరప్రాంతంలోని నాలుగు లక్షల మందిని సురక్షితప్రాంతాలకు తరలించి భారీ ప్రాణ నష్టాన్ని నివారించిందని ఓడీఆర్ఆర్ ప్రశంసలు కురుపించింది.

భారత దేశం ప్రకృతి విప్తతులను ఎదుర్కోవడంలో చాలా మెరుగైందని.. ముందస్తు హెచ్చరికల వ్యవస్థలు సమర్థంగా పనిచేస్తున్నాయని.. సరైన హోమ్ వర్క్ తో భారత్ భారీగా పురోగమించిందని యూనైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ జనరల్ (ఎస్ఆర్ఎస్ జీ) హెడ్ సెండాయ్ ప్రేమ్ వర్క్ కొనియాడారు. భారత్ కు తమ సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. .

ఫొని తుఫాన్ నుంచి కాపాడడానికి తాము బంగ్లాదేశ్ లో ప్రజలను శరణార్థుల శిబిరాలకు తరలించామని.. రక్షణ చర్యలు చేపట్టామని ఐకరాజ్యసమితి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సాధారణ తుఫాన్ కాదని ఫొనిని తీవ్ర తుఫాన్ గా తేల్చి భారత్ ఎంతో జాగ్రత్త పడిందని యూఎన్ ప్రతినిధి తెలిపారు. భారత వాతావరణ శాఖ అంచనా నూటికి నూరు పాళ్లు నిజమైందని అన్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఫొని తుఫాన్ కారణంగా 8మంది చనిపోయారని.. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వివరించారు. ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి అంటానియో గుట్టెరెస్ మాట్లాడుతూ యూఎన్ మానవతా సంస్థలు ఇప్పటికే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో దిగి వారికి సహాయసహకారాలు అందిస్తున్నాయని.. బాధితులకు అండగా ఉన్నాయని వివరించారు.