Begin typing your search above and press return to search.

జొమాటోకు సైబరాబాద్ ట్వీట్ పంచ్

By:  Tupaki Desk   |   25 Sept 2020 12:30 PM IST
జొమాటోకు సైబరాబాద్ ట్వీట్ పంచ్
X
హైదరాబాద్ నగర వాసులు చేసే ట్రాఫిక్ ఉల్లంఘనలపై హైదరాబాద్.. సైబరాబాద్ సోషల్ మీడియా టీం వేస్తున్న పంచ్ లు ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. అందరిని ఆకర్షిస్తున్నాయి. సుతిమెత్తని మాటలతో వాతలు పెడుతూ చేస్తున్న ట్వీట్లకు నెటిజన్ల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. తాజాగా జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ ఇష్టారాజ్యంగా ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించిన వైనాన్ని తప్పు పడుతూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ లో ట్వీట్ పంచ్ విసిరారు.

సదరు జొమాటో బాయ్ చేసిన తప్పును కళ్లకు కట్టినట్లుగా చూపుతూ.. వీడియోను సైతం తమ పోస్టులో పోస్టు చేశారు. నిబంధనల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తూ.. తనకేమాత్రం పట్టనట్లుగా అడ్డదిడ్డంగా యూ టర్న్ తీసుకున్న వైనం సీసీ కెమేరాల్లో నిక్షిప్తమైంది.

దీంతో.. స్పందించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దీన్ని ట్వీట్ గా మలిచి.. ‘డియర్ జొమాటో.. మీ ఎగ్ిక్యూటివ్ లకు మీరు ఇదే నేర్పిస్తున్నారా?’ అంటూ పంచ్ వేశారు. హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ సిగ్నల్స్ దగ్గర చోటు చేసుకున్న ఈ ఉదంతాన్ని ట్వీట్ రూపంలో పోస్టు చేసిన వైనానికి నెటిజన్ల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కొందరు సైబరాబాద్ పోలీసుల పని తీరును మెచ్చుకుంటూ.. వారి సుతిమెత్తని పంచ్ ల్ని పొగిడేస్తూ రీట్వీట్లు చేస్తున్నారు.